యూఎన్‌: భారత దౌత్యవేత్త ఘన విజయం

7 Nov, 2020 16:54 IST|Sakshi

న్యూయార్క్‌/న్యూఢిల్లీ: భారత దౌత్యవేత్త విదిషా మైత్ర ఐక్యరాజ్యసమితిలో కీలక కమిటీకి ఎన్నికయ్యారు. ఐరాస ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించే అడ్వైజరీ కమిటీ ఆన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అండ్‌ బడ్జెటరీ క్వశ్చన్స్‌(ఏసీఏబీక్యూ)కి జరిగిన ఎన్నికల్లో ఆమె గెలుపొందారు. 16 మంది సభ్యులను కలిగి ఉండే ఈ యూఎన్‌ కమిటీ సభ్యత్వానికి పోటీపడి.. ఇరాక్‌కు చెందిన అభ్యర్థిని ఓడించి విజయం సాధించారు. ఆసియా- పసిఫిక్‌ గ్రూపు నుంచి పోటీపడిన ఆమె, 126 మంది యూఎన్‌ సభ్యుల మద్దతు కూడగట్టుకుని జయకేతనం ఎగురవేశారు.

కాగా 1946 నుంచే భారత్‌ ఏసీఏబీక్యూ సభ్య దేశంగా కొనసాగుతోంది. ఐరాస ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్‌ తదితర అంశాలను పరిశీలిస్తుంది. ఎగ్జిక్యూటివ్‌ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ నేతృత్వంలో పనిచేసే ఈ కమిటీ జనరల్‌ అసెంబ్లీ అవసరాలకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తుంది. కాగా విదిషా మైత్ర ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ అధికారిణి. ప్రస్తుతం ఆమె యూఎన్‌లోని ఇండియా పర్మినెంట్‌ మిషన్‌ కార్యదర్శిగా ఉన్నారు. గతంలో పారిస్‌, పోర్ట్‌ లూయీస్‌, న్యూయార్క్‌లో దౌత్యవేత్తగా పనిచేశారు.  (చదవండి: అమెరికా అధ్యక్ష ఫలితం తేలకపోతే...)

మరిన్ని వార్తలు