సాయమే లక్ష్యం: రంగంలోకి భారత్‌కు చెందిన జూలీ.. రోమియో.. హానీ.. రాంబో

11 Feb, 2023 13:52 IST|Sakshi

సిరియా, టర్కీలో భయంకర ప్రకృతి విలయం సంభవించిన విషయం తెలిసిందే. భూకంపం కారణంగా దాదాపు 24వేలకు పైగా మంది మృత్యువాతపడ్డారు. రెండు ప్రాంతాల్లో ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారిని సహయక బృందాలు బయటకు తీస్తున్నాయి. ఈ క్రమంలో అనే దేశాలకు చెందిన టీమ్స్‌ సహయక చర్యల్లో పాల్గొన్నాయి. 

భారత్‌ కూడా అందరి కంటే ముందే సహాయక చర్యలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఆర్మీ యుద్ధ విమానాల్లో అక్కడికి వైద్య సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారుఉ. ఇదిలా ఉండగా.. భారత్‌కు చెందిన డాగ్ స్క్వాడ్‌లు కూడా రంగంలోకి దిగాయి. న‌లుగురు స‌భ్యుల డాగ్ స్క్వాడ్ రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో పాల్గొంటోంది. ఎన్డీఆర్ఎఫ్ స్క్వాడ్‌లోని నాలుగు లాబ్ర‌డార్ శున‌కాలు ఉన్నాయి. జూలీ, రోమియో, హానీ, రాంబో కుక్కులు తుర్కియే భూకంప బాధితుల్ని గుర్తించే ప‌నిలో నిమ‌గ్నం అయ్యాయి. ఈ నాలుగు జాగిలాల‌తో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెళ్లాయి.

కాగా, స్నిఫింగ్‌లో ఈ డాగ్ స్క్వాడ్ ఎంతో స్పెషల్‌. రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో ప్ర‌త్యేకంగా వాళ్లు శిక్ష‌ణ పొందారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని ఈ డాగ్‌ స్క్వాడ్ వెంటనే పసిగడుతుంది. మరోవైపు.. విప‌త్క‌ర వాతావ‌ర‌ణంలోనూ ఇండియ‌న్ డాగ్ స్క్వాడ్ బాధితుల్ని గుర్తించడం విశేషం. ఇక, టర్కీలో ఉష్ణోగ్రతలు మైనస్‌ అయిదు డిగ్రీలకు చేరుకోవడంతో సహాయ చర్యలకి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. 

భూకంపం కారణంగా టర్కీ ఆ దేశం భౌగోళికంగా అయిదు నుంచి ఆరు మీటర్లు పక్కకి జరిగి ఉంటుందని  భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి పొరల్లో ఉన్న టెక్టోనిక్‌ ప్లేట్స్‌ (ఫలకాలు) తీవ్రమైన రాపిడి కారణంగానే ఇది సంభవించినట్టు తెలిపారు. సిరియాతో పోల్చి చూస్తే టర్కీలో రెండు ఫలకాల మధ్య ఏర్పడిన ఒత్తిడి వల్ల  రిక్టర్‌ స్కేలుపై 7.8 తీవ్రతతో భూకంపం కుదిపేసిందని, ఫలితంగా దేశమే కాస్త జరిగిందని ఇటలీకి చెందిన సెసిమాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ కార్లో డొగ్లోని చెప్పారు. భూ పొరల్లో ఉన్న అనతోలియా ప్లేట్‌ వాయవ్య దిశగా ఉన్న అరేబికా ప్లేట్‌ వైపు జరగడంతో ఇలా దేశమే భౌగోళికంగా కదిలే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఒక టెక్టోనిక్‌ ప్లేట్‌ పశ్చిమ వైపు, మరో ప్లేట్‌ తూర్పు వైపు కదలడంతో భారీ భూకంపం సంభవించిందని ఆయన వివరించారు.  వాలీబాల్‌ ఆట కోసం అడియామాన్‌కు వచ్చిన కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు 39 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా భావిస్తున్నారు. ఫమగుస్తా కాలేజీకి చెందిన ఈ బృందం ఏడంతస్తులున్న ఒక హోటల్‌లో బస చేశారు.

మరిన్ని వార్తలు