Afghanistan: ఇండియన్‌ ఎంబసీ మూతపడలేదు!

17 Aug, 2021 19:09 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసారన్న వార్తలపై కేంద్రం స్పందించింది. కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం మూతపడలేదని మంగళవారం వివరణ ఇచ్చింది.  భారత ఎంబసీలో సేవలు కొన సాగుతున్నాయని, దాదాపు 1650 మంది భారత్ వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారుని ప్రకటించింది.

మరోవైపు కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయానికి భద్రత కల్పిస్తున్నఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బంది తమ సేవలను కొనసాగిస్తున్నారు. అక్కడి పరిస్థితుల నేపథ్యంలో హిందన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో  సిబ్బందిని భద్రత కోసం మోహరించారు. మిగిలిన సిబ్బందికి రక్షణగా అక్కడే ఉండనున్నారు. అఫ్గానిస్తాన్‌లో పరిస్థితి దారుణంగా ఉందని ఐటీబీపీ కమాండింగ్ ఆఫీసర్  రవి కాంత్ గౌతమ్ అన్నారు. అయినా  ప్రజలను విజయవంతంగా తరలించగలిగాము, ఇది మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.   తమ దళాలు 3-4 రోజులు నిద్రపోలేదనీ,  ఈ రాత్రి హాయిగా నిద్రపోతామంటూ సంతోషం ప్రకటించారు. (Afghanistan: తాలిబన్లకు మరో షాక్‌! సాయం నిలిపివేత)

కాగా తాలిబన్ల ఆక్రమణ, అఫ్గన్‌ పరిస్థితుల నేపథ్యంలో వేలాదిమంది పౌరులు దేశం విడిచి వెళ్లేందుకు కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి పరుగులు తీశారు. మరోవైపు అఫ్గన్లకు అండగా నిలుస్తామని ప్రభుత్వం సోమవారం తెలిపింది. కాబూల్ నుండి వాణిజ్య విమానాలు ప్రారంభం తర్వాత హిందువులు, సిక్కులను దేశానికి తిరిగి రప్పించేందుకు ప్రాధాన్యతనిస్తామని, భారత పౌరుల భద్రతకోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని విదేశాంగశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. (Afghanistan:ప్రపంచంలోని అతిపెద్ద లిథియం నిక్షేపం తాలిబన్ల చేతుల్లోకి!)

మరిన్ని వార్తలు