Russia War: భారత్‌ కీలక నిర్ణయం.. అటు రష్యాకు మరో షాక్‌

13 May, 2022 19:50 IST|Sakshi

ఉక్రెయిన్‌లో రష్యా దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆక్రమణలపర్వం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో మూసివేసిన భారత రాయబార కార్యాలయాన్ని ఈనెల 17వ తేదీ నుంచి తిరిగి ఓపెన్‌ చేయనున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌పై రష్యా భయంకరమైన బాంబు దాడుల నేపథ్యంలో కీవ్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని పోలాండ్‌కు తరలించారు. మార్చి 13వ తేదీ నుండి పోలాండ్‌లోని వార్సా నుంచి తాత్కాలికంగా భారత రాయబార కార్యాలయం సేవలను కొనసాగించారు. అక్కడి నుంచి ఉక్రెయిన్‌ నుంచి స్వదేశానికి భారతీయులను తరలించారు. 

మరోవైపు.. ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమైన రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌ తీవ్రంగా నష్టపోయింది. ఆస్తి నష్టం, ప్రాణా నష్టంతో ఉక్రె​యిన్‌ విలవిలాడుతోంది. ఇక, రష్యాపై ఆంక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జపాన్ అతిపెద్ద ఎనర్జీ కార్పొరేషన్ ఈఎన్‌ఈవోఎస్‌(ENEOS) రష్యకు చమురు కొనుగోలును నిలిపివేసింది. 

ఇది కూడా చదవండి: నార్త్‌ కొరియాలో కరోనా కలకలం.. టెన్షన్‌లో కిమ్‌ జోంగ్‌ ఉన్‌

మరిన్ని వార్తలు