కష్టాల్లో ఉన్న లంకను భారత్ ఆదుకుంటుంది: హైకమిషనర్‌

16 Jul, 2022 11:08 IST|Sakshi

కొలంబో: తీవ్ర సంక్షోభంలో చిక్కుకుని విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది శ్రీలంక. ఈ నేపథ్యంలో కొలంబోలోని భారత హైకమిషనర్‌.. పార్లమెంటు స్పీకర్‌ను శనివారం ఉదయం కలిశారు. కష్టాల్లో ఉన్న లంకకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సంక్షోభ సమయంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడటంలో కీలక పాత్ర పోషించిన పార్లమెంటు పాత్రను  కొనియాడారు.

చదవండి: శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింఘే ప్రమాణం

శ్రీలంక ఆర్థికంగా కోలుకునేందుకు, దేశంలో స్థిరత్వం నెలకొనేవరకు భారత్ సాయం కొనసాగిస్తుందని హైకమిషనర్ పేర్కొన్నారు. ఈమేరకు కొలంబోలోని భారత హైకమిషన్ కార్యాలయం ట్వీట్ చేసింది. శ్రీలంక అధ్యక్ష పదవికి గొటబయ రాజీనామ చేసి తాత్కాలిక అధ్యక్షునిగా ప్రధాని రణిల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టిన మరునాడే ఈ సమావేశం జరిగింది.

మరిన్ని వార్తలు