రష్యాకి వ్యతిరేకంగా ఓటు...ఊహించని షాక్‌ ఇచ్చిన భారత న్యాయమూర్తి

17 Mar, 2022 12:17 IST|Sakshi

Indian Judge Votes Against Russia: ఉక్రెయిన్‌ పై దాడిని నిలిపివేయాలని బుధవారం అంతర్జాతీయ ఉన్నత న్యాయస్థానం(ఐసీజే) రష్యాని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు న్యాయస్థానం మాస్కో బలప్రయోగం పట్ల తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు రష్యన్ ఫెడరేషన్ ఉక్రెయిన్ భూభాగంలో ఫిబ్రవరి 24న ప్రారంభించిన సైనిక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేస్తుందని స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో తుది నిర్ణయం పెండింగ్‌లో ఉందని ప్రిసైడింగ్ జడ్జి జోన్ డోనోఘ్యూ అంతర్జాతీయ న్యాయస్థానానికి తెలిపారు.

అయితే ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌ పై దాడి చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే కైవ్‌ అంతర్జాతీయ న్యాయంస్థానంలో ఫిర్యాదు చేసింది. అయితే మాస్కో ఐసీజేకి అధికార పరిధి లేదంటూ వాదిస్తూ ఉంది. కానీ  ఐసీజే ఈ కేసులో అధికార పరిధిని కలిగి ఉందని తీర్పునివ్వడమే గాక ఉక్రెనియన్ భూభాగంలో మారణహోమం జరిగినట్లు రష్యన్ ఫెడరేషన్ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు కూడా తమ వద్ద లేవని గట్టి కౌంటరిచ్చింది. అంతేగాక ఉక్రెయిన్ నుంచి పారిపోతున్న శరణార్థుల సంఖ్య మూడు మిలియన్లకు చేరుకోవడం తోపాటు కైవ్‌లోని నివాస భవనాలపై రష్యా దళాలు దాడులను పెంచడంతో బుధవారం ఈ కేసు విచారణకు వచ్చింది.

యూటర్న్‌ తీసుకున్న భారత న్యాయమూర్తి
అయితే భారత్‌ అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎప్పుడు తటస్థ వైఖరిని అవలంభిస్తుంది. అలాగే అంతర్జాతీయ న్యాయస్థానానికి చేరిన ఉక్రెయిన్‌ రష్యా వ్యవహారంలో కూడా అలానే ఉండాలనుకుంది. అంతేకాదు తటస్థంగా ఉన్నమంటూ రష్యాకు సహకరిస్తున్న భారత్‌కు అంతర్జాతీయ న్యాయస్థానంలో తాము నామినేట్‌ చేసిన భారత జడ్జీ ఊహించని షాక్‌ ఇచ్చారు. అయినా ఇప్పటివరకూ జరిగిన ఐరాస భద్రతా మండలి, సాధారణ  సమావేశాల్లో భారత్‌ రష్యా ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఖండించమే కాక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చిందే తప్ప ఓటింగ్‌కి మాత్రం దూరంగానే ఉండిపోయింది.

అయితే హేగేలోని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్‌ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ దాడి పై జరిగిన ఓటింగ్‌లో భారత్‌ తన తటస్థ వైఖరికి భిన్నంగా ఓటు వేసింది. ఈ మేరకు ఐసీజేలో భారత న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. జస్టిస్ భండారీ పూర్తిగా ప్రభుత్వం, వివిధ మిషన్ల మద్దతుతో ఐసీజేకికి నామినేట్ అయ్యారు. జస్టిస్ భండారీ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయడం, పైగా ఆయన ఇచ్చిన వివరణ ఆధారంగా ఇవన్నీ స్వతంత్ర చర్య అయినప్పటికీ, వివిధ అంతర్జాతీయ వేదికలపై భారతదేశం వైఖరికి భిన్నంగా ఉందని స్పష్టమైపోయింది. దీంతో ఇప్పటివరకు తటస్థ రాగం ఆలపించిన భారత్‌కు భారీ షాక్‌ తగిలింది.

(చదవండి: రష్యా పైశాచికత్వం...చిన్నారులని కూడా చూడకుండా బాంబుల దాడి)

మరిన్ని వార్తలు