పిలిప్పీన్స్‌లో భారత్‌కు చెందిన కబడ్డీ కోచ్‌ దారుణ హత్య

5 Jan, 2023 12:23 IST|Sakshi

మనీలా: పిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో దారుణం సంఘటన వెలుగు చూసింది. భారత్‌లోని పంజాబ్‌, మోగా ప్రాంతానికి చెందిన కబడ్డీ కోచ్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌ గిండ్రూ(43)ను దుండగులు కాల్చి చంపినట్లు మనీలా పోలీసులు తెలిపారు. గుర్‌ప్రీత్‌ నాలుగేళ్ల క్రితం పిలిప్పీన్స్‌ వెళ్లాడు. పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన క్రమంలో బుధవారం ఇంట్లోకి చొరబడిన కొందరు దుండగులు కాల్పులు జరిపారు. దీంతో తలలో తూటాలు దిగి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కబడ్డీ కోచ్‌ను దుండగులు ఎందుకు హత్య చేశారు, దాడికి గల కారణాలేంటనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. 

కెనడాలో మరో ఘటన..
కెనడాలోని ఒంటారియాలో మరో భారతీయుడు హత్యకు గురయ్యాడు. పంజాబ్‌కు చెందిన మోహిత్‌ శర్మ(28) నిర్మాణుష్య ప్రాంతంలో కారు వెనకసీటులో మృతి చెంది కనిపించాడు. కొద్ది రోజులుగా విదేశాల్లో భారత సంతతి వ్యక్తులపై దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయి. భారతీయులపై దాడులు పెరిగిన క్రమంలో కెనడాలో ఉన్న పౌరులు అప్రమతంగా ఉండాలని భారత విదేశాంగ శాఖ మార్గదర్శకాలు సైతం జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: ‘స్పీకర్‌ను ఎన్నుకోలేకపోవడం సిగ్గుచేటు’.. రిపబ్లికన్లపై బైడెన్‌ విమర్శలు!

మరిన్ని వార్తలు