జాక్‌పాట్ అంటే నీదే త‌మ్ముడు

4 Sep, 2020 20:28 IST|Sakshi

షార్జా : కొంద‌రికి వ‌ద్ద‌న్నా అదృష్టం నక్క‌లాగా అతుక్కుపోతుందంటారు. ఏదో స‌ర‌దాకు కొన్న లాట‌రీ టికెట్ ద్వారా అంత పెద్ద మొత్తం వ‌స్తుంద‌ని బ‌హుశా అత‌ను కూడా ఊహించి ఉండ‌డు. లాట‌రీలో నీకు కోట్లు త‌గిలాయ‌రా అని మొద‌టిసారి వ‌చ్చి చెప్పిన‌ప్పుడు అత‌ను న‌మ్మ‌లేదు.. తీరా అది నిజ‌మేనని తెలిశాక అత‌ని ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. విష‌యం ఆ నోటా ఈ నోటా తెలిసి... 'జాక్‌పాట్ అంటే నీదే త‌మ్ముడు' అంటూ కామెంట్ చేశారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. పంజాబ్‌కు చెందిన గుర్‌ప్రీత్ సింగ్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం యూఏఈ వెళ్లాడు. షార్జాలో ఐటీ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న ఆయన.. ఆగస్ట్ 12న అబుదాబిలో బిగ్ టికెట్ రాఫెల్ లాట‌రీ టికెట్‌ను కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 3న ల‌క్కీ డ్రా నిర్వాహకులు డ్రా తీయగా.. గుర్‌ప్రీత్ సింగ్ 10 మిలియ‌న్ దిర్హామ్స్‌( భార‌త క‌రెన్సీలో రూ.19.90కోట్లు) గెలుచుకున్నాడు.చదవండి : ప్లీజ్‌.. బోన్‌లెస్ చికెన్ పేరును మార్చండి)

దీనిపై గురుప్రీత్ సంతోషం వ్యక్తం చేస్తూ.. ' లాట‌రీలో నేను కోట్ల  రూపాయ‌లు గెలుచుకున్నా అంటే ఇప్ప‌టికీ న‌మ్మ‌లేక‌పోతున్నా. అదృష్టం అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. లక్కీ డ్రాలో గెలుచుకున్న డబ్బులతో యూఏఈలో ఓ ఇల్లు కొనుగోలు చేస్తా.  నా తల్లిదండ్రులంటే నాకు చెప్ప‌లేనంత ఇష్టం.. ఈ డ‌బ్బుల‌తో వారిని యూఏఈకి తీసుకొస్తా'నంటూ చెప్పుకొచ్చాడు.(చదవండి : విమర్శకుల నోళ్లుమూయించాం : రష్యా)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా