నేడే అంతరిక్షంలోకి తెలుగు అతివ

11 Jul, 2021 03:50 IST|Sakshi

హూస్టన్‌: భారతీయ సంతతికి చెందిన బండ్ల శిరీష ఆదివారం అంతరిక్షయానానికి సిద్ధమైంది. అంతరిక్ష యాత్ర విజయవంతమైతే ఈ ఘనత సాధించిన మూడో భారతీయ సంతతి మహిళగా శిరీష నిలుస్తుంది. గతంలో కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌ స్పేస్‌లో ప్రయాణించారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ స్పేస్‌ షిప్‌లో ఆ సంస్థ అధిపతి రిచర్బ్‌ బ్రాన్సన్‌తో మరియు 5గురు సభ్యులతో కలిసి శిరీష అంతరిక్ష ప్రయాణం చేయనుంది. ఈ షిప్‌లో భాగస్వామి కావడం తనకెంతో గౌరవకారణమని శిరీషట్వీట్‌ చేశారు.

షిప్‌లో ఆమె రిసెర్చర్‌ ఎక్స్‌పీరియన్స్‌ బాధ్యతలు చేపట్టనుంది. తనకు ఈ అవకాశం దక్కినట్లు తెలియగానే మాటలు రాలేదంటూ వర్జిన్‌ గెలాక్టిక్‌ ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్టు చేశారు. అమెరికాలోని ప్యూర్‌డ్యూ యూనివర్సిటీలో ఆమె విద్యాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా తాను చదివిన యూనివర్సిటీని గుర్తు చేసుకున్నారు. 2015లో వర్జిన్‌ గలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాల విభాగ మేనేజరుగా చేరారు. ప్రస్తుతం కంపెనీ గవర్నమెంట్‌ ఎఫైర్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆపరేషన్స్‌ విభాగం ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.

మరిన్ని వార్తలు