మరో భారతీయ అమెరికన్‌కు ఉన్నత పదవి!

1 Aug, 2021 01:24 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వం మరో భారతీయ అమెరికన్‌ను ఉన్నత పదవికి నామినేట్‌ చేసింది. అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛకు సంబంధించిన అంబాసిడర్‌–ఎట్‌–లార్జ్‌ పదవికి రషద్‌ హుస్సేన్‌(41)ను దేశాధ్యక్షుడు జో బైడెన్‌ నామినేట్‌ చేశారని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ ప్రకటించింది. అంబాసిడర్‌–ఎట్‌–లార్జ్‌ పదవిలో ఉన్న వారు అమెరికా తరఫున కేవలం ఒక దేశానికే రాయబారిగా ఉండబోరు. పలు దేశాలకు, వేర్వేరు బాధ్యతల్లో రాయబారిగా, అవసరమైతే మంత్రిగా వ్యవహరిస్తారు.

ఐక్యరాజ్యసమితి, యురోపియన్‌ యూనియన్‌ (ఈయూ)ల్లో అమెరికా తరఫున అంతర్జాతీయ చర్చల్లో పాల్గొంటారు. ఇంతటి ఉన్నత పదవికి అమెరికా ఒక ముస్లింను నామినేట్‌ చేయడం ఇదే ప్రథమం. ప్రస్తుతం హుస్సేన్‌ అమెరికా జాతీయ భద్రతా మండలిలో పార్ట్‌నర్‌షిప్స్, గ్లోబల్‌ ఎంగేజ్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో బరాక్‌ ఒబామా హయాంలో ఇస్లామిక్‌ కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఐవోసీ)లో అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా, వ్యూహాత్మక ఉగ్రవ్యతిరేక విభాగం ప్రత్యేక ప్రతినిధిగా, వైట్‌హౌస్‌ బృందంలో డెప్యూటీ అసోసియేట్‌గా బాధ్యతలు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు