గెలుపు దిశగా మరికొందరు భారత సంతతి వ్యక్తులు

4 Nov, 2020 13:29 IST|Sakshi
ముడోసారి ప్రతినిధుల సభకు ఎన్నికయిన రాజా కృష్ణమూర్తి

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి వరుసగా మూడో సారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. వివరాలు.. డెమొక్రాటిక్‌ అభ్యర్థి రాజా కృష్ణమూర్తి మూడో సారి విజయం సాధించారు. ఢిల్లీలో జన్మించిన కృష్ణమూర్తి ప్రత్యర్థిప్రెస్టన్ నెల్సన్‌పై విజయం సాధించారు. 71 శాతం ఓట్లతో గెలుపొందారు. కృష్ణమూర్తి 2016లో తొలిసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.​ ఈయన తల్లిదండ్రులు తమిళనాడుకు చెందినవారు. (ట్రంప్‌ సంచలన కామెంట్లు: ట్వీట్‌ తొలగింపు )

మరో భారత సంతతి వ్యక్తి‌ అమి బెరా కాలిఫోర్నియా నుంచి వరుసగా ఐదో సారి విజయం సాధించాలని ఆశిస్తున్నారు. అలానే మరో ఇండియన్‌ అమెరికన్‌ ఆర్‌ఓ ఖన్నా కూడా కాలిఫోర్నియా నుంచి మూడో సారి ప్రతినిధుల సభకు ఎన్నికవ్వాలని కోరుకుంటున్నారు. వీరిద్దరితో పాటు మరో ఇండో అమెరికన్‌ ప్రమిలా జయపాల్‌ కూడా వాషింగ్టన్‌ నుంచి మూడోసారి గెలుపొందాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియా, వాషింగ్టన్‌ రాష్ట్రాల్లో ఓటింగ్‌ కొనసాగుతుంది. త్వరలోనే పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.

మరిన్ని వార్తలు