భారత సంతతి అమృతపాల్‌ సింగ్‌ మాన్‌కు యూకే గౌరవ జాబితాలో చోటు !

2 Jan, 2022 21:20 IST|Sakshi

లండన్‌కు చెందిన భారతీయ సంతతికి చెందిన రెస్టారెంట్ అమృత్‌పాల్ సింగ్ మాన్‌కి యూకే నూతన సంవత్సర గౌరవాల జాబితాలో చోటు దక్కింది. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి సుమారు 2 లక్షల మందికి పైగా నిరుపేదలకుకి భోజనాన్ని అందించిన గొప్ప మహోన్నత పరోపకారి అమృతపాల్ సింగ్ మాన్. స్వచ్ఛంద సంస్థల ద్వారా సమాజానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఓబీఈ అవార్డును పొందారు.  

(చదవండి:  టెస్లా ఆటో పైలెట్‌ టీమ్‌కి ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తి!)

అంతేకాదు న్యూ ఇయర్ గౌరవ జాబితా 2022లో క్వీన్‌ సత్కరించబడిన వారిలో ఆయన కూడా ఉన్నారు. అయితే ఆయన్ను చాలా మందికి అమృత్ మాన్ అని పిలుస్తారు. ఆయన చాలా సంవత్సరాలుగా నిరాశ్రయులు, సాయుధ దళాలు, వారసత్వం కళలతో కోసం కృషి చేసే స్వచ్ఛంద సంస్థలకు తనవంతు మద్దతు ఇచ్చారు. అంతేకాదు ఆయన యూకే తొలి పంజాబీ రెస్టారెంట్‌గా అతని ముత్తాత 1946లో స్థాపించిన కోవెంట్ గార్డెన్‌లోని పంజాబ్ రెస్టారెంట్ ఎండీగానే యూకేలో ఎక్కువమందికి తెలుసు. ఈ మేరకు యూకే లెఫ్టినెంట్ కల్నల్ డేవిడ్ ఉటింగ్ మాట్లాడుతూ...."సిక్కు సమాజంలో గుర్తింపు పొందిన నాయకుడిగా, అమృత్ మాన్ చాలా మంది సిక్కులు నివసించే విభిన్న దేశంలో వారి గుర్తింపు ఏమిటో, వారి సంస్కృతిని ఎలా కొనసాగించాలో నిర్వచించడంలో సహాయపడటానికి చాలా కష్టపడ్డారు.

ఇందులో భాగంగా సాయుధ బలగాలకు అతని మద్దతు అద్భుతంగా ఉంది. అతని సహాయం లేకుండా సిక్కు సమాజంలో ప్రస్తుతం ఉన్న ప్రగతిని సాధించగలమా! అనే సందేహం కలుగుతుంది. ఆయనతో కలిసి అనేక సందర్భాల్లో పనిచేసినందున, ఈ గౌరవానికి ఆయన అర్హులు" అని అన్నారు. ఈ క్రమంలో అమృత్ మాన్ మాట్లాడుతూ..." నేను గౌరవానికి సంబంధించిన ఇమెయిల్ నోటిఫికేషన్‌ను స్వీకరించినప్పుడు నమ్మలేకపోయాను. ఈ గౌరవం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు ఆఫీసర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ గుర్తింపు దాతృత్వ పనిని మరింతంగా కొనసాగించాలనే తన సంకల్పాన్ని బలపరుస్తుంది అని"  అమృత్ మాన్ అన్నారు.

(చదవండి: చిన్నారిపై కుక్కలు మూకుమ్మడి దాడి.. నిజంగానే దేవుడిలా వచ్చాడు!)

మరిన్ని వార్తలు