ఇండియాకు వెళ్లిపో.. అమెరికా చట్టసభ్యురాలు ప్రమీలా జయపాల్‌కు బెదిరింపు కాల్స్

9 Sep, 2022 18:20 IST|Sakshi

సియాటెల్‌: ఇండో-అమెరికన్‌ కాంగ్రెస్‌ఉమెన్‌ ప్రమీలా జయపాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఫోన్‌ చేసి మరీ ఓ వ్యక్తి ఆమెను దూషించాడు. అంతేకాదు జాతివివక్ష, జాత్యాహంకారం ప్రదర్శిస్తూ.. ఆమెను ఇండియాకు వెళ్లిపోవాలంటూ బెదిరించాడు. 

ఇందుకు సంబంధించి ఐదు ఆడియో క్లిప్పులను అమెరికా చట్టసభ్యురాలైన ఆమె తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. మరీ అభ్యంతకరంగా, పరుష పదజాలంతో ప్రమీలా జయపాల్‌ను దూషించాడు ఆ వ్యక్తి. అంతేకాదు పుట్టిన దేశానికే వెళ్లిపోవాలంటూ ఆమెను బెదిరించాడు కూడా. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో అమెరికాలో స్థిరపడిన భారతీయులపై జాత్యహంకారం ప్రదర్శిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఘటనలపై చర్యలు చేపడుతున్నప్పటికీ.. పరిస్థితుల్లో మార్పు మాత్రం రావడం లేదు.

చెన్నైలో పుట్టిన ప్రమీలా(55).. సియాటెల్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమెరికా ప్రతినిధుల సభ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి ఇండో-అమెరికన్‌(డెమొక్రటిక్‌ పార్టీ తరపున) కూడా ఈమెనే. అయితే ఆమెకు ఇలాంటి అనుభవం ఎదురు కావడం మొదటిసారేం కాదు. ఈ ఏడాది సమ్మర్‌లో.. సియాటెల్‌లోని ఆమె ఇంటి బయట గన్‌తో ఓ వ్యక్తి వీరంగం వేశాడు. ప్రమీలా కుటుంబ సభ్యుల్ని దూషిస్తూ.. బెదిరింపులకు దిగాడు. దుండగుడ్ని బ్రెట్ ఫోర్సెల్ (49)గా గుర్తించి.. పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇదీ చదవండి: ఆ డాక్టర్‌ ఏకంగా హౌస్‌ కీపర్‌ని పెళ్లి చేసుకుంది!

మరిన్ని వార్తలు