నాన్న నన్ను క్షమించండి అంటూ సెల్ఫీ వీడియో! కన్నీటి పర్యంతమవుతున్న తండ్రి

6 Aug, 2022 17:57 IST|Sakshi

మహిళలను వరకట్నం కోసమో లేక ఆడపిల్లలు పుట్టారనో వేధించే అత్తమామాలు కోకొల్లలు. భర్త కూడా తన తల్లిదండ్రులకే వంతపాడుతూ వేధిస్తుంటే ఇక ఆ మహిళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అది కూడా విదేశాల్లో ఎక్కడో ఉండి ఈ బాధలు అనుభవిస్తుంటే ఇక ఆ మహిళలు పరిస్థితి మరితం ఘెరంగా ఉంటుంది. సదరు బాధిత మహిళలు దిక్కుతోచని నిస్సహయ స్థితిలో వేధింపులకు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అచ్చం అలానే న్యూయార్క్‌లో ఉంటున్న ఒక భారతీయ మహిళ ఇలానే చేయండంతో ఆమె తల్లిదండ్రులు కూతురు మృతదేహం కోసం ఆవేదనగా నిరీక్షిస్తున్నారు.

వివరాల్లోకెళ్తే...యూపీలోని బిజ్నోర్‌కి చెందిన 30 ఏళ్ల మన్‌దీప్‌ కౌర్‌ 2015లో రంజోద్‌ బీర్‌ సింగ్‌ సంధును వివాహం చేసుకుని అమెరికా వెళ్లింది. ఐతే కొన్నాళ్లు సంతోషంగానే గడిచింది వారి కాపురం. ఎ‍ప్పుడైతే తనకు ఇద్దరు కూతుళ్ల  పుట్టారో అప్పటి నుంచి ఆమెకు కష్టాలు అధికమయ్యాయి. ఏదో ఒక రోజు మారతాడనే ఆశతో ఆ వేధింపులను భరిస్తూ వచ్చింది. ఆ వేధింపులు తగ్గకపోక మరింత తీవ్రమవ్వడంతో ...ఆమె తన భర్త అత్త మామ వేధిస్తున్నారంటూ తన తల్లిదండ్రులకు తన గోడును వెళ్లబోసుకోవడమే గాక తనను హింసిస్తున్న వీడియోలను కూడా పంపించింది.

దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త తనను కాపాడమంటూ వేడుకున్నాడు. దీంతో ఆమె మారతాడనుకుని కేసు పెట్టడానికి వెనక్కి తగ్గింది.  ఆ తర్వాత నుంచి ఆమెను మరింతగా అత్తమామ, భర్త కలిసి హింసించడం ప్రారంభించారు. ఇక వారి వేధింపులు తాళ్లలేక ఆమె ఒక సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వివరిస్తూ నాన్న నన్ను క్షమించండి. నన్ను చచ్చిపోమని భర్త, అత్తమామ పదేపదే అంటున్నారు. ఇక తన వల్ల​ కాదంటూ మన్‌దీప్‌ ఆత్యహత్య చేసుకుని చనిపోతున్నట్లు వీడియోలో తెలిపింది.

అయితే ఆమె తల్లిదండ్రులు తమ అల్లుడు తమ కూతురిని ఎలా వేధించేవాడో వివరిస్తూ... పలు వీడియోలు పంపించిందని చెప్పుకొచ్చారు. మారతాడని ఓపిక పట్టానని ఒకానొక సమయంలో పోలీసులను కూడా సంప్రదించానని చెప్పుకొచ్చాడు. తన కూతురు మృతదేహాన్ని భారత్‌ తీసుకువచ్చేందుకు సహాయం చేయండి అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు ఆమె తండ్రి. ఈ మేరకు వేధింపులు, గృహహింసకు గురవుతున్న సిక్కు మహిళల కోసం పనిచేస్తున్న  ది కౌర్ మూవ్‌మెంట్ అనే సంస్థ బాధిత మహిళ  సెల్ఫీ వీడియోని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో​  తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహంతో ఇంకా మనం ఏ సమాజంలో ఉన్నామంటూ  ప్రశ్నిస్తూ..ట్వీట్‌ చేశారు.

(చదవండి: సుప్రీం ముందు రేప్‌ బాధితురాలి సూసైడ్‌ ఘటన.. సంచలన కేసులో అతుల్‌ రాయ్‌కు ఊరట)

మరిన్ని వార్తలు