TOP 10 Food Waste Countries in The World: ఆహారం ‘వృథా’లో టాప్‌ టెన్‌ దేశాలివే..

14 Apr, 2022 08:30 IST|Sakshi

సాక్షి సెంట్రల్‌ డెస్క్‌: భూమ్మీద మనుషులందరికీ సరిపోయేంత ఆహారం ఉత్పత్తి అవుతున్నా అందరికీ అందని దుస్థితి. ఓ వైపు రెండు పూటలా తిండి దొరకనివారు కోట్లాది మంది ఉంటే.. మరోవైపు మరోవైపు కోట్ల మందికి సరిపడా ఫుడ్‌ వృథా అవుతున్న పరిస్థితి. అసలు పండించే దగ్గరి నుంచి వండాక పడేసేదాకా ఆహారం వృథాకు ఎన్నో లెక్కలున్నాయి. అవేంటో తెలుసుకుందామా?

చదవండి: రోడ్డు పక్కన డబ్బుల సంచి‌.. కుర్రాడు చేసిన పనికి ఫిదా!

భూమ్మీద ఏటా ఉత్పత్తి అవుతున్న పండ్లు, కూరగాయల్లో దాదాపు సగం మేర ఏదో ఓ రూపంలో వృథా అవుతూనే ఉన్నాయి. 
మనుషులు తినేందుకు వీలుగా తయారు చేసిన/వండిన ఆహారంలో దాదాపు మూడో వంతు వరకు.. కిందపడిపోవడం/చెడిపోవడం/పడేయడం ద్వారా ఏటా సుమారు 1,300 టన్నులు వృథా అవుతోంది.  
ఏటా ప్రపంచవ్యాప్తంగా వృథా అవుతున్న ఆహారంలో కనీసం పావు వంతును వినియోగించుకోగలిగినా.. సుమారు 87 కోట్ల మంది ఆకలి తీర్చవచ్చట.

‘వృథా’.. రెండో పెద్ద దేశం 
ఆహారం ఉత్పత్తి కావడానికి ఎన్నో వనరులు అవసరం. మొక్కలకైతే పొలాలు, తోటలను సిద్ధం చేయడం నుంచి ఎరువులు, పురుగు మందులు, ఇతర ఖర్చులదాకా ఎంతో కావాలి. కోళ్లు, పశువులు, చేపలు వంటి వాటికోసం ఎంతో వ్యయం అవుతుంది. ప్రతిదానికి మానవ శ్రమ, కరెంటు, పెట్రోలియం ఉత్పత్తుల వాడకంతో లింకు ఉంటుంది. అందుకే అంతర్జాతీయంగా ఇలాంటి అవసరాలు, వ్యయాలన్నింటినీ ‘కర్బన ఉద్గారాల (గ్రీన్‌హౌజ్‌ గ్యాస్‌) విడుదల’తో లెక్కిస్తారు. దీని ప్రకారం.. వృథా అయ్యే ఆహారాన్ని లెక్కిస్తే.. ప్రపంచంలో చైనా తర్వాత మనది  అతిపెద్ద దేశం అవుతుందట.
 

అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. ఆహారం వృథా విషయంలో రెండు భిన్నమైన కోణాలు 
పంటలు పండించడం నుంచి రవాణా, మార్కెటింగ్, విక్రయం వరకు ఉన్న దశల్లో అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో వృథా ఎక్కువగా ఉంటోంది. పంటలు పండించడం, నిల్వ, ఇతర అంశాల్లో సరైన సౌకర్యాలు, టెక్నాలజీ అందుబాటులో లేకపోవడమే దీనికి కారణమని  ఐక్యరాజ్యసమితి తమ నివేదికలో పేర్కొంది. 
వండిన, తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారం విషయంలో అభివృద్ధి చెందిన, ధనిక దేశాల్లో వృథా చాలా ఎక్కువ.  తమ సంపాదనలో ఆహారానికి అయ్యే ఖర్చు తక్కువగానే ఉండటం, ఆహారాన్ని ఎక్కువగా ప్రాసెస్‌ చేయడం, అవసరానికి మించి కొనుగోలు చేస్తుండటం వంటివి కారణమని పేర్కొంది. 
యూరప్, ఉత్తర అమెరికా ఖండాల్లోని దేశాల్లో సగటున ఒక్కోవ్యక్తి ఏటా 100 కిలోల ఆహారాన్ని వృథా చేస్తారని అంచనా. ఇది ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలతో పోలిస్తే పదింతలు ఎక్కువ కావడం గమనార్హం.

కోట్ల కిలోమీటర్ల మేర వృథా
ఏటా భారీ ఎత్తున ఆహారం వృ«థా అవుతోంది కదా. మరి దానంతటినీ ఉత్పత్తి చేయడానికి వాడుతున్న భూమి విస్తీర్ణం ఎంతో తెలుసా?.. ఏకంగా 1.35 కోట్ల చదరపు కిలోమీటర్లు. 

మరిన్ని వార్తలు