పోలాండ్‌లో భారతీయ యువకుడి హత్య..

30 Jan, 2023 12:55 IST|Sakshi

వార్సా: పోలాండ్‌లో భారతీయ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కేరళ త్రిస్సూర్ జిల్లాలోని ఒల్లూర్‌కు చెందిన సూరజ్(23) పోలాండ్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే జార్జియా దేశానికి చెందిన ఓ ముఠా సూరజ్, అతని స్నేహితులతో గొడవపడ్డారు. 

ఈ ఘర్షణలో సూరజ్‌ను జార్జియా దేశస్థులు కత్తితో పొడిచిచంపారు. అతని స్నేహితులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. సూరజ్ మృతిని వార్సాలోని ఇండియన్ ఎంబసీతో పాటు అతని కుటుంబసభ్యులు ధ్రువీకరించారు. అయితే ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఎందుకు జరిగిందనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.

కొద్దిరోజుల క్రితం కేరళ పాలక్కడ్‌కు చెందిన ఇబ్రహీం షరీఫ్ అనే యువకుడు కూడా పోలాండ్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఇతడ్ని ఓనరే క్రూరంగా చంపాడు. పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. అయితే ఎందుకు హత్య చేశాడనే విషయం మాత్రం తెలియరాలేదు.
చదవండి: ఒక్క నిమిషం పట్టదు.. పుతిన్‌పై సంచలన ఆరోపణలు

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు