ఆ విధానం యుద్ధాన్ని ఆపడంలో సహాయపడదు

28 Apr, 2022 13:12 IST|Sakshi

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో భారత్‌ అనుసరిస్తున్న విధానం పై ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రిబవర్రి 24 రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆదేశాలతో రష్యా బలగాలు ఉక్రెయిన్‌ పై దాడులకు దిగింది. గత రెండు నెలలుగా ఉక్రెయిన్‌ పై దాడులు కొనసాగిస్తునే ఉంది. దీంతో ప్రపంచ దేశాలన్ని ఉక్రెయిన్‌కి బహిరంగంగా మద్దతు తెలపడమే కాకుండా సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. అయితే భారత్‌ కూడా ఇరు దేశాలకు యుద్థం వద్దని చర్చలు దిశగా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించింది కానీ తటస్థంగా ఉండిపోయింది.

అంతేగాక భారత్‌ ఆయుధాల కొనుగోలు విషయంలో రష్యా దేశం పై ఆధారపడి ఉండటమే కాకుండా రష్యాతో గల అనుబంధం గురించి చెబుతుండటం గమనార్హం. అయితే ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి భారత్‌ వైఖరిని తప్పుబట్టడమే కాకుండా భారత్‌ అవలంభిస్తున్న తటస్థ వైఖరి యుద్ధాన్ని ఆపలేదని చెప్పారు. అంతేగాదు ఉక్రెయిన్‌ పట్ల భారత్‌ చూపిస్తున్న సానూభూతిని అభినందిస్తున్నాం కానీ ఈ తటస్థ వైఖరి యుద్ధాని ఆపేందుకు ఉపయోగపడదని నొక్కి చెప్పారు. అయినా నేరస్థుడు, బాధితుడు స్పష్టంగా కనిపిస్తున్నప్పడూ బాధితుడి పక్షాన నిలబడటమే నిజమైన కర్తవ్యం అన్నారు.

యుద్ధంలో గెలుస్తామని విర్రవీగుతున్న రష్యా భ్రమలను పోగొట్టాలే ఉక్రెయిన్‌కి భారత్‌ మద్దతు ఇవ్వాలన్నారు. రష్యా కంటే భారత్‌​  భిన్నమైనదన్నారు. అంతేగాదు డిమిట్రో కులేబా ఈ యుద్ధాన్ని ప్రజాస్వామానికి నిరంకుశత్వానికి మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు. అందువల్ల అతి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ ఉక్రెయిన్‌ పక్షాన నిలబడాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉందని వ్యాఖ్యానించారు. పైగా యుద్ధ భూమిలో రష్యా అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్‌ నిర్వీర్యం చేసేస్తుంది కాబట్టి భారత్‌కి రష్యా ఆయుధాలు కొనగోలు చేయడంలో ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని ప్రశ్నించారు కూడా.

ఉక్రెనియన్ భూభాగంలోని యుద్ధ నేరాలకు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు రష్యా పూర్తి బాధ్యత వహించక తప్పదన్నారు. రష్యా యుద్ధంలో ఎంత క్రూరత్వంగా ఉ‍న్న అణ్యాయుధాలను ఉపయోగించదనే భావిస్తున్నానని అన్నారు. పుతిన్‌కి ఏమాత్ర జ్ఞానం ఉంటే అణ్వాయుధాలను ఆశ్రయించడం అంటే మాస్కో ముగింపు అని అర్థం చేసుకుంటాడని డిమిట్రో కులేబా చెప్పారు.

(చదవండి: ఉబ్బిన ముఖం, వణికిపోతూ.. క్షీణిస్తున్న పుతిన్‌ ఆరోగ్యం?)

మరిన్ని వార్తలు