సిరప్‌లు తాగి కిడ్నీ సమస్యలతో 99 మంది చిన్నారులు మృతి.. టానిక్‌లపై బ్యాన్‌!

20 Oct, 2022 13:07 IST|Sakshi

ఇటీవలే దగ్గు మందు తాగి చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. భారత్‌కు చెందిన ఫార్మా సంస్థ మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ సంస్థ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు మందు తాగి గాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందారు. కాగా, ఈ ఘటన మరువక ముందే ఇండోనేషియాలో మరో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. సిరప్‌లు తీసుకున్న కారణంగానే నెల రోజుల్లో కిడ్నీ సమస్యలతో 99 మృతి చెందారు.

వివరాల ప్రకారం.. ఇండోనేషియాలో అన్ని సిరప్‌లు, లిక్విడ్‌ మెడిసిన్స్‌ను నిషేధిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, నెల రోజుల వ్యవధిలో కిడ్నీ సమస్యలతో 99 మృతి చెందినట్లు సమాచారం. ఈ కారణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలా ఉండగా, మృతిచెందిన పిల్లలు.. ఆయా సిరప్‌లు తీసుకున్న తర్వాతే కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో, పిల్లలకు సంబంధించిన అన్ని సిరప్‌లు, లిక్విడ్‌ మెడిసిన్‌ విక్రయాలను నిలిపివేయాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి మొహ్మద్‌ సయారిల్‌ మన్సూర్‌  ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. ఇండోనేషియాలో ఈ ఏడాది ప్రారంభం నుంచి పిల్లల మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. 

మరిన్ని వార్తలు