షాకింగ్‌: ఒంటి నిండా కట్లు.. షార్ట్‌ మీద వచ్చిన వరుడు

7 Apr, 2021 20:45 IST|Sakshi

ఇండోనేషియాలో చోటు చేసుకున్న ఘటన

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతన్న ఫోటోలు

జకర్తా: వివాహం.. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన వేడుక. లైఫ్‌లో ఒక్కసారే జరిగే ఈ వేడుకని (అఫ్‌కోర్స్‌.. కొందిరి జీవితంలో రెండు, మూడు పెళ్లిల్లు కూడా ఉంటాయి)మరపురాని మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలని భావిస్తారు చాలా మంది. అందుకే శక్తికి మించి ఖర్చు చేస్తారు. పెళ్లి మంటపం.. నుంచి తినే భోజనాల వరకు ప్రతీది ప్రత్యేకంగా ఉండాలని చూస్తారు. ఇక వివాహ సమయంలో ధరించే వస్త్రాల పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. వేలు, లక్షలు ఖర్చు చేసి మరి ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంటారు. వివాహ సమయంలో ప్రతి ఒక్కరి దృష్టి తమ మీద ఉండాలని ఆశిస్తారు. సాధారణంగా ఏ పెళ్లిలో అయినా కనిపించే దృశ్యాలు ఇవి. 

కానీ ఇప్పుడు మనం చెప్పుకోబేయే వార్త ఇందుకు భిన్నం. ఇక్కడ ఓ వరుడు చేతికి కట్టుతో.. ఒంటి మీద చొక్కా లేకుండా కేవలం షార్ట్‌ ధరించి పెళ్లికి హాజరయ్యారు. కాళ్లు, చేతులకు కట్లు కట్టి ఉన్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ సంఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. ఈ పెళ్లి వేడుకలో వరుడి శరీరం మీద కట్లతో.. ఒంటి మీద చొక్కా కూడా లేకుండా హాజరైతే.. వధువు మాత్రం బుట్టబొమ్మలా తయారయి వచ్చి పెళ్లి కుమారిడి పక్కన కూర్చుంది. ఈ వేడుకకు బంధువులు కూడా బాగానే హాజరయ్యారు. ఈ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో పస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన వారంతా ‘‘పాపం ఆ యువకుడికి పెళ్లి అంటే ఇష్టం లేదేమో.. కొట్టి మరి ఇలా పెళ్లి చేస్తున్నారు’’ అని కామెంట్‌ చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ‘‘ప్లీజ్‌ ఈ ఫోటోల వెనక స్టోరీ షేర్‌ చేయండి’’ అని కామెంట్‌ చేస్తున్నారు. 

ఈ కామెంట్లపై సదరు పెళ్లి కుమార్తె స్పందించింది. ‘‘మా ఇద్దరికి ఈ వివామం ఇష్టమే. అయితే పెళ్లికి కొద్ది రోజుల ముందు నా భర్తకు యాక్సిడెంట్‌ అయ్యింది. పెట్రోల్‌ తీసుకురావడం కోసం వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. దాంతో ఇలా ఒళ్లంతా గాయాలయ్యాయి.  బట్టలు వేసుకోవడానికి రావడం లేదు. అందుకే ఇలా షార్ట్‌ మీద వచ్చాడు’’ అని తెలిపింది. 

చదవండి: పెళ్లిలో భర్త పర్మిషన్‌తో లవర్‌ని..

మరిన్ని వార్తలు