Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. రిక్టరు స్కేలుపై తీవ్రత ఎంతంటే..?

11 Feb, 2023 19:32 IST|Sakshi

జకర్తా: ఇండోనేషియాలో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 6.0 తీవ్రత నమోదైంది. తలాడ్ ఐలాండ్స్ సమీపంలో 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఇండోనేషియా జియోగ్రఫీసిక్స్ ఏజెన్సీ బీఎంకేజీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం లేదు. దీని వల్ల సునామీ వచ్చే ప్రమాదం కూడా లేదని అధికారులు తెలిపారు.
చదవండి:  టర్కీ విధ్వంసం.. నాలుగు రోజులు మూత్రం తాగి బతికిన యువకుడు..

మరిన్ని వార్తలు