సుమత్రా స్టైల్లో జల్లికట్టు.. ఎవరినీ విజేతగా ప్రకటించరు!

14 Feb, 2022 16:35 IST|Sakshi

ఆ బురద, అందులో పరుగెత్తుతున్న ఎడ్లు, చుట్టూ జనాలను చూస్తుంటే ఇదేదో జల్లికట్టు పోటీలాగుందే.. అనిపిస్తోంది కదా. అవును అలాంటిదే. అయితే జరిగింది మాత్రం ఇండోనేసియాలోని పశ్చిమ సుమత్రాలో. ఆట పేరు ‘పాకు జావి’. కరోనా వల్ల ఆగిన ఈ క్రీడకు మళ్లీ అక్కడి ప్రభుత్వం అనుమతివ్వడంతో ఈ నెలలో పోటీలు మొదలయ్యాయి. అక్కడి తనహ్‌ దాతర్‌ ప్రాంతంలో ఏటా వరి కోతల తర్వాత ఈ పోటీలు నిర్వహిస్తారు. 

ఇందులో భాగంగా ఓ వరిపొలంలో దాదాపు 60 నుంచి 250 మీటర్ల మేర బురద ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తారు. రెండు ఎడ్లను ఓ నాగలికి కట్టి దానిపై ఎడ్లను నడిపే వ్యక్తి నిలబడతాడు. కింద పడకుండా ఎడ్ల తోకలను పట్టుకుంటాడు. పేరుకే ఇది ఎద్దుల పోటీ అయినా ఇందులో నేరుగా ఎద్దులేమీ పోటీ పడవు. ఎవరినీ విజేతగా ప్రకటించరు. (చదవండి: పెంపుడు పంది కోసం న్యాయపోరాటం

అయితే ఆ పోటీని చూడటానికి వచ్చిన వాళ్లు ఎడ్ల వేగం, సామర్థ్యం లెక్కగట్టి వాటిని సాధారణం కన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. తనహ్‌ దాతర్‌ ప్రాంతంలోని ప్రజలు ఏళ్లుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా సర్కారు మద్దతుతో ఈ ఆటను చూసేందుకు అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు కూడా వస్తున్నారు. (క్లిక్‌: వెరైటీ అంటే ఇదే.. గేదె, ఆవు పాలు కాదు.. ‘ఆలూ పాలు’)

మరిన్ని వార్తలు