సెల్ఫీలతో మిలీనియర్‌ అయిన స్టూడెంట్‌.. ఎలా ఎదిగాడో తెలుసా?

18 Jan, 2022 19:36 IST|Sakshi

డబ్బులు సంపాదించడానికి మార్గాలు అనేకం. ఈ ఇన్‌స్టంట్‌ రోజుల్లో.. ఈజీగా మనీని, అదీ చిన్నవయసులో సంపాదించేవాళ్లను సైతం చూస్తున్నాం. వీళ్లలో చాలామంది కష్టంతో ఎదిగిన వాళ్లు ఉండొచ్చు!. కానీ, కష్టపడకుండా కేవలం ఫోటోలతో.. కోట్లు సంపాదించి మిలీయనీర్‌గా ఎదిగిన వ్యక్తి గురించి ఎప్పుడైనా మీరు విన్నారా!.


సుల్తాన్ గుస్తాఫ్ అల్ ఘోజాలీ.. ఇండోనేషియా సెంట్రల్ సిటీ ఆఫ్ సెమరాంగ్‌ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్‌. ఘోజాలి గత ఐదేళ్లుగా దాదాపు ప్రతిరోజూ తన కంప్యూటర్ ముందు కూర్చొని సెల్ఫీలు తీసుకునేవాడు. ఇలా అతను దాదాపు వెయ్యి సెల్ఫీలను తీసుకున్నాడు. పైగా తన గ్రాడ్యుయేషన్ డే కోసం టైమ్‌లాప్స్ వీడియోను కూడా రూపొందించాలని ప్లాన్ చేశాడు. ఈలోపు సరదాగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ గురించి తెలుసుకుని.. అందులో తన సెల్ఫీలను ఆన్‌లైన్‌లో ఎన్‌ఎఫ్‌టీలుగా విక్రయించాలని నిర్ణయించుకున్నాడు.

తన సెల్ఫీలను ఎవరు కొంటారో చూద్దాం అని తమషాగా చేశాడు. సెల్ఫీని కేవలం మూడు డాలర్లు(రూ.223)గా కోట్‌ చేశాడు. కానీ, అతను కూడా ఊహించని రేంజ్‌లో సెల్పీలకు డిమాండ్‌ పెరిగింది. మరోవైపు క్రిప్టోకరెన్సీ ‘ఈథర్’ ఎఫెక్ట్‌తో ఒక్కో సెల్ఫీ రూ 60 వేలు పలికింది. ఈ క్రమంలో ఒక ప్రముఖ సెలబ్రిటీ చెఫ్‌ తన సోషల్ మీడియా ఖాతాలో ఘోజాలీ సెల్ఫీని ప్రమోట్ చేశాడు. ఆ ప్రభావంతో ఘోజాలీ సెల్ఫీ అమ్మకాలు అమాంతం ఊపందుకున్నాయి. దీంతో ఘోజాలీ సుమారు రూ 7 కోట్లు పైనే సంపాదించగలిగాడు. ఏదిఏమైన సరదాగా తమాషాకి చేసిన పని అతన్ని కోటీశ్వరుడిగా చేయడం విశేషం.

(చదవండి: ఆ పుర్రే పురాతన కాలం నాటి అడ్వాన్స్‌డ్‌ సర్జరీకి ప్రతీక!)

మరిన్ని వార్తలు