ఇండోనేషియా విమానం గల్లంతు

9 Jan, 2021 17:03 IST|Sakshi

జకార్తా: ప్రయాణికులను తీసుకుని ఎగిరిన నాలుగు నిమిషాలకే ఇండోనేషియాకు చెందిన విమానం అదృశ్యమైంది. జకార్తా నుంచి పాంటియానక్‌ వెళ్తున్న ఎస్‌జే 182 శ్రీవిజయ ఎయిర్‌ బోయింగ్‌ విమానం టేకాఫ్‌ తీసుకున్న కొన్ని నిమిషాలకే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో ప్రయాణికులతో పాటు సిబ్బంది కలిపి మొత్తం 59 మంది ఉన్నట్లు తెలుస్తోంది.ఇండోనేషియా రాజధాని జకార్తాలోని సోకర్నో హట్టా విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొన్ని నిమిషాలకే అదృశ్యమవడం కలకలం రేపుతోంది. అయితే ఆ విమానం ఓ ద్వీపంలో కూలిపోయి ఉంటుందని ఆ దేశానికి చెందిన మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇండోనేషియా దేశంలో విమానయాలకు విషాద చరిత్ర ఉంది. 2018 అక్టోబర్‌ 29న ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుని 189 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. గతంలో కూడా చాలా ప్రమాదాలు సంభవించాయి.

మరిన్ని వార్తలు