ఇన్‌స్టా మొరాయింపు: ‘నేను ఎలా బ్రతకగలను’

11 Nov, 2020 14:22 IST|Sakshi

న్యూఢిల్లీ : మంగళవారం ఉదయంనుంచి ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు మొరాయించటంతో వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్‌ వేదికగా తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. భారత కాలమానం ప్రకారం నిన్న ఉదయం 4.07 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో, వీడియో అప్‌లోడ్‌, షేరింగ్‌లో వినియోగదారులకు సమస్యలు ఎదురయ్యాయి. దీంతో తమ సమస్యలను ట్విటర్‌ వేదికగా ఏకరువు పెడుతున్నారు. ‘‘ ఇన్‌స్టాగ్రామ్‌కి ఏమైంది.. నేను రోజంతా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు చేయలేకపోయాను.. అప్‌డేట్‌ను పూర్తిచేయండి లేదా, ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించండి...  నిన్నటి నుంచి ఫోటో అప్‌లోడ్‌ చేయలేకపోతున్నా. నేను ఎలా బ్రతకగలను... ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. (యూట్యూబ్‌ ఛానల్స్‌ పెట్టేందుకు నో ఛాన్స్...)

కాగా, ఇన్‌స్టాగ్రామ్‌ మంగళవారం ఉదయం  ‘షేర్‌ యువర్‌ లైట్‌’ అనే రియాలిటీ ఫీచర్‌ను రాబోయే దీపావళీ పండుగ దృష్ట్యా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. తమ ఆలోచనలను అందరితో పంచుకోవడానికి ఉపయోగపడే విధంగా దాన్ని రూపొందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎఫెక్ట్స్‌ గాలరీ ఓపెన్‌ చేయగానే ‘ఫెస్టివ్‌ దియా’ ఫీచర్‌ కనిపిస్తుంది. ఈ ఎఫెక్ట్స్‌ ఇంగ్లీష్‌, హిందీ, మరాఠీ, బెంగాలీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ న్యూ అప్‌డేట్‌ కారణంగానే ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు మొరాయించాయని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు