లాంగెస్ట్‌ కిస్‌.. గురక వీరుడు ఇంట్రస్టింగ్‌ వరల్డ్‌ రికార్డులు 

25 Aug, 2021 16:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సాధారణంగా ఎవరికైనా అరుదైన స్పెషల్‌ టాలెంట్‌ ఉంటే వావ్‌...విశేషమే అంటూ అబ్బురపడతాం. అలాగే సంబంధిత వ్యక్తులు కూడా చరిత్రలో ఎవ్వరూ ఎన్నడూ సాధించని ఘనతను సాధించిన వ్యక్తిగా తమ పేర్లు నిలవాలని ఆశపడతారు. రికార్డులకెక్కాలని ఉబలాట పడతారు. వాటిల్లో ముఖ్యమైంది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్.  అలా అరుదైన, కొన్ని విచిత్రమైన  గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ను  ఒకసారి చూద్దాం.

నిలువెల్లా టాటూలే

టాటూలు ఈ రోజుల్లో సర్వసాధారణం. దాదాపు ప్రతి వ్యక్తి వారి శరీరంలో ఏదో ఒక భాగంలో పచ్చబొట్టు వేసుకుంటూ ఉండటం  చేస్తూనే ఉన్నాం.  వీటిల్లో వివిధ డిజైన్‌లు, పరిమాణాలురంగులు.. బొమ్మలు, అబ్బో వీటి కథ పెద్దదే. పై ఫోటోలని వ్యక్తి న్యూజిలాండ్‌కు చెందిన శ్రీమంతుడు  గ్రెగొరీ పాల్ మెక్‌లారెన్ లేదా లక్కీ డైమండ్ రిచ్. ఇతనికి టాటూలంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే. శరీరం మొత్తం టాటూలే. ఇందుకు 1000 గంటలకు పైగా గడిపాడట. అందుకే ప్రపంచంలో అత్యధికంగా టాటూలు వేయించుకున్న వ్యక్తిగా రికార్డు కొట్టేశాడు. 

ప్రపంచంలో అతిపెద్ద ఉల్లిపాయ
నెవార్క్‌ పీటర్ గ్లేజ్‌బ్రూక్ ప్రపంచంలోనే అత్యంత భారీ ఉల్లిని పండించడంలో పాపులర్‌. 18 పౌండ్ల బరువున్న (8కిలోలకు పైమాటే)  ఉల్లిపాయను పండించి భారీ రికార్డును కొట్టేశాడు.

ఒకే కోన్ మీద ఇన్ని ఐస్ క్రీమ్ స్కూప్స్?
ఐస్‌క్రీం అంటే పిల్లాపెద్దా అందరికీ మోజే. అందులోనూ మండు వేసవిలో చల్లచల్లగా కోన్‌ ఐస్‌క్రీం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే ఈ ఐస్‌క్రీ కోన్‌ తయారీలో ఓ వ్యక్తి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇటలీకి చెందిన దిమిత్రి పాన్సిరా కోన్‌పై ఏకంగా125 స్కూప్స్ అమర్చి ఔరా అనిపించాడు. అంతేకాదు 2018లో తన పేరుతో ఉన్న వరల్డ్‌ రికార్డునే తనే బ్రేక్‌ చేశాడు.

తాబేలు ఎంత వేగంగా పరిగెత్తగలదు?

అతి తక్కువ వేగం గురించి ఆలోచిస్తే గుర్తుకు వచ్చేది తాబేలు.  నెమ్మదిగా మారువేరు తాబేలు  వేగంలోరికార్డు  సాధించడం అంటే  అరుదే కదా. కేవలం 19.59 సెకన్లలో 18 అడుగుల  దూసుకెళ్లిందో తాబేలు. దీని పేరు బెర్టీని. అంతేకాదు 70ల నుంచి  మరే తాబేలు  బ్రేక్‌ చేయలేని రికార్డును బద్దలు కొట్టింది. విచిత్రమైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఒకటి. యూ​కేలోని  అడ్వెంచర్ వ్యాలీ అనే ఫ్యామిలీ అడ్వెంచర్ పార్క్‌లో దీని నివాసం.

మీరిలా చర్మాన్ని సాగదీయలగలరా

పుట్టుకతో వచ్చిన వైకల్యాన్ని లేదా లోపాన్ని రికార్డు మలచడం  మరో విశేషం. గ్యారీ టర్నర్‌ కనెక్టివ్‌ టిష్యూ డిజార్డర్‌తో బాధపడుతున్నారు. ఇదే అనతికి ప్రపంచంలోని సాగతీత చర్మంఉన్న వ్యక్తిగా రికార్డును తెచ్చిపెట్టింది. 1999 నుండి ఎవరూ అతని రికార్డును అధిగమించలేదు. ఎవరైనా సాధారణంగా కడుపు చర్మాన్ని 6.25 అంగుళాల వరకు సాగదీయడం మన ఊహించలేం. కానీ గ్యారీ ఆ పనిని సులువుగా చేస్తాడు. శరీరంమీద చర్మాన్ని ఎవరూ చేయలేనంతంగా సాగదీయగలడు  ఎలాంటి   నొప్పి లేకుండా. ఇతను 2005 నుండి ఒక  సర్కస్‌లో సభ్యుడిగా ఉన్నారు. 

పాస్తా తినే రికార్డు


ఇప్పటి తరం యూత్‌ పాస్తాను ఇష్టపడతారు. కానీ ఈ ఫోటోలోని మహిళకు పాస్తా అంటే మరీ  పిచ్చన్నమాట.  పాస్తా తినే పోటీలోనే ఈస్టర్ మిచెల్ లెస్కో డబ్బు సంపాదించే మార్గంగా ఎంచుకున్నారు. 100 గ్రాముల పాస్తా  కేవలం 26.69 సెకన్లలో పాస్తా మొత్తం గిన్నెను వేగంగా లాగిం చేసిన రికార్డు కొట్టేసింది. పాస్తాలో సాస్ కలుపుకుని మరీ చకా చకా భోంచేసింది.

లాంగెస్ట్‌ కిస్‌
ప్రేమికులు ముద్దు ముచ్చట్లలోమునిగి తేలడం మామూలే. థాయ్‌లాండ్‌కు చెందిన లక్షన , ఎక్కాచాయ్ తిరనరత్  జంట లాంగెస్ట్‌ కిస్‌ పెట్టుకుని రికార్డు లకెక్కారు. 2020లో జరిగిన పోటీల్లో  ఏకంగా 58 గంటల 35 నిమిషాల 58 సెకన్ల పాటు కొనసాగిన లిప్ లాక్‌లో ఉండిపోయారు. ఈ సుదీర్ఘ ముద్దుతో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. అంతేకాదు డీహైడ్రేషన్‌తో బాధపడకుండా ఇంతసేపు ముద్దు పెట్టుకోవచ్చని మాకు కూడా తెలియదంటూ సెలవిచ్చారు. 

చేతికి చిక్కారో మటాషే! బలమైన చేతులున్న మహిళ
యూకే చెందిన లిసా డెన్నిస్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళలలో ఒకరిగా నిలిచారు. ఎలాగంటే... కేవలం ఒకే ఒక్క నిమిషంలో 923 రూఫ్‌ బ్రిక్స్‌ని  పిండి చేయడం ఆమె గొప్పతనం.   సాధారణంగా మార్షల్‌ అర్ట్స్‌లో ప్రావీణ్య ఉన్నవారే ఇలాంటి ఫీట్లు చేయడం మనం  చూశాం.

గురక వీరుడు
గురకలో కూడా ప్రపంచ రికార్డు సొంతంచేసుకున్న ఘనత కోరే వాకర్ట్ సొంతం. 1993 లో స్వీడన్‌లోని ఒరెబ్రో జనరల్ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు అతని గురక 93 డీబేఏ గరిష్ట స్థాయి నమోదు చేయడం ప్రపంచ రికార్డు. గురక నివారణకు ఇపుడు చాలా మార్గాలున్నప్పటికీ, గురక వీరుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ.  కష్టాలు పక్కన ఉన్నవాళ్లకే తప్ప వాళ్లు మాత్రం హాయిగా నిద్రపోతారు. గురక పెట్టే వాళ్ల పక్కన నిద్రపోవడం అంటే అదొక సవాలే.

కాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బుక్‌ను 1995లో మొదటిసారిగా ప్రచురించారు. అప్పటినుండి, ఇది ప్రపంచంలోని అత్యంత విశేషమైన విషయాలను  నమోదు చేస్తోంది. ఈ ప్రపంచ రికార్డ్స్‌లో మన పేరు నిలవాలంటే..దానికి సంబంధించి చాలా కృషి, పట్టుదల కావాలి. తగిన సమయాన్ని కేటాయించడంతోపాటు అంకితభావం , కఠోర అభ్యాసం కావాలి.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు