ఇరాన్‌లో వేలాది నిరసనకారులకు క్షమాభిక్ష

14 Mar, 2023 04:49 IST|Sakshi

దుబాయ్‌: ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో అరెస్టయిన 22 వేల మందికి ఇరాన్‌ క్షమాభిక్ష ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఓ యువతి పోలీస్‌ కస్టడీలో మృతి చెందినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడం, అణచివేత చర్యల్లో భాగంగా పోలీసుల కాల్పుల్లో వందల మంది చనిపోవడం తెలిసిందే. వేలాది మందిని ౖజñయ్పాలయ్యారు.

ఈ నేపథ్యంలోనే 22 వేల మందికి సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ క్షమాభిక్ష ప్రసాదించినట్లు ఇరాన్‌ న్యాయశాఖ అధిపతి జి.ఎం.ఎజెహి సోమవారం తెలిపారు. వీరితోపాటు వివిధ ఆరోపణలను ఎదుర్కొంటున్న మొత్తం 82 వేల మందికి సుప్రీం నేత క్షమాభిక్ష ప్రకటించారన్నారు. వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న రంజాన్‌ నెల సందర్భంగా సుప్రీం నేత ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. తాజా చర్యతో ప్రభుత్వ విధానాలపట్ల దేశ ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం తీవ్రతను పాలకులు గుర్తించినట్లయింది. 

మరిన్ని వార్తలు