ఇరాన్, సౌదీ అరేబియా స్నేహగీతం

11 Mar, 2023 05:37 IST|Sakshi

దుబాయ్‌: ప్రత్యర్థి దేశాలుగా ఇన్నాళ్లూ కత్తులు దూసుకున్న ఇరాన్, సౌదీ అరేబియా ఇప్పుడు స్నేహగీతం ఆలపిస్తున్నాయి. దౌత్యపరమైన సంబంధాలను పునరుద్ధరించుకొనేందుకు, రాయబార కార్యాలయాలను తెరిచేందుకు ఇరు దేశాలు శుక్రవారం అంగీకారానికొచ్చాయి. ఇరాన్, సౌదీ అరేబియా మధ్య ఏడేళ్ల క్రితం సంబంధాలు తెగిపోయాయి. చైనా చొరవతో మళ్లీ సంబంధాలు మెరుగుపడుతున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య సాయుధ ఘర్షణ తలెత్తే ప్రమాదం ఇక తప్పినట్లేనని పరిశీలకులు చెబుతున్నారు.

గల్ఫ్‌లోని అరబ్‌ దేశాలు అగ్రరాజ్యం అమెరికా వైపు మొగ్గుచూపకుండా చైనా ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగా ఇరాన్, సౌదీ అరేబియా నడుమ ఇటీవలే సయోధ్య కుదిర్చింది. ఇది చైనాకు దౌత్యపరంగా అతిపెద్ద విజయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాతో కుదిరిన ఒప్పందంపై ఇరాన్, సౌదీ అరేబియా ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. అయితే, దీనిపై చైనా మీడియా ఇంకా స్పందించలేదు. యెమెన్‌లో ఇరాన్, సౌదీ అరేబియా ఘర్షణలు కూడా çసమసేలా కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు