హిజాబ్‌కు వ్యతిరేకంగా జుట్టు ముడవడమే ఆమె తప్పైంది.. కాల్చి చంపిన పోలీసులు!

28 Sep, 2022 13:14 IST|Sakshi

హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్‌ అట్టుడుకుతోంది. దేశ వ్యాప్తంగా రోజురోజుకు హిజాబ్‌పై వ్యతిరేకత తీవ్రతరమవుతోంది. హిజాబ్‌ ఆందోళనలు పలుచోట్ల హింసాత్మకంగా మారాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటికే పలువురు మృత్యువాతపడగా.. వేలాది మంది అరెస్ట్ అయ్యారు. అనేకమంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కాగా 23 ఏళ్ల హదీస్‌ నజాఫీ అనే ఇరాన్‌ యువతి.. తన జుట్టు ముడుచుకుంటూ హిజాబ్‌ వ్యతిరేక పోరాటంలో పాల్గొంటున్నాని తెలుపుతూ పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది. అయితే సదరు యువతిని ఇరాన్‌ భద్రతా బలగాలు కాల్చి చంపినట్లు తెలుస్తోంది. యువతి చాతీ, ముఖం, చేతులు, మెడపై కాల్పులు జరిపారు. హదీస్‌ మరణించినట్లు జర్నలిస్ట్, మహిళా హక్కుల నేత మసీష్ అలినేజాద్ సెప్టెంబర్ 25న ట్వీట్ చేశారు. 
చదవండి: చరిత్రలోనే తొలిసారి.. ఇటలీ ప్రధానిగా ఓ మహిళ.. ఎవరీ జార్జియా మెలోని?

అసలేంటి హిజాబ్‌ వివాదం
హిజాబ్‌ను సరిగ్గా ధరించలేదన్న ఆరోపణలతో కొద్దిరోజుల క్రితం మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేయగా.. సెప్టెంబర్‌ 16న కస్టడీలోనే ఆమె మరణించిన విషయం తెలిసిందే. ఆమె శరీరంపై తీవ్ర గాయాలు ఉండగా.. యువతి గుండెపోటుతో మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే పోలీసులు హింసించడం వల్లే మరణించిందంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. హిజాబ్‌కు వ్యతిరేకంగా మహిళలు, యువత గళమెత్తారు. ముఖ్యంగా మహిళలు హిజాబ్‌ తీసేస్తూ, తమ జుట్టు కత్తిరించుకుంటూ నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం ఈ నిరసనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. అక్కడి సోషల్ మీడియాపై బ్యాన్ విధించింది.

మరిన్ని వార్తలు