అల్‌జజీరా జర్నలిస్టు.. ఇజ్రాయెల్‌ ఆర్మీ సంచలన ప్రకటన

12 Feb, 2024 09:53 IST|Sakshi

జెరూసలెం: పాలస్తీనాకు చెందిన అల్‌జజీరా విలేకరి మహమ్మద్‌ వషా హమాస్‌ సీనియర్‌ కమాండర్‌గా పనిచేస్తున్నాడని ఇజ్రాయెల్‌ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. గాజాలోని హమాస్‌ క్యాంపులపై తాము చేసిన దాడుల్లో ఈ విషయం వెలుగు చూసినట్లు తెలిపింది.

మహమ్మద్‌ వషాకు చెందిన ల్యాప్‌టాప్‌లో దొరికిన చిత్రాలే ఇందుకు ఆధారాలని తెలిపింది. హమాస్‌ యాంటీ ట్యాంక్‌ మిసైల్‌ యూనిట్‌ హెడ్‌గా వషా పనిచేశారని వెల్లడించింది. ‘హమాస్‌ క్యాంపులో దొరికిన ఒక ల్యాప్‌టాప్‌పై మా ఇంటెలిజెన్స్‌ దర్యాప్తు జరిపింది.

దానిలో మహ్మద్‌ వషా కార్యకలాపాలకు సంబంధించిన చిత్రాలు దొరికాయి. త్వరలో జర్నలిస్టు ముసుగులో ఉన్న ఉగ్రవాదుల వివరాలు ఇంకెన్ని బయటపెడతామో ఎవరికి తెలుసు’ అని ఐడీఎఫ్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ అవిచే అడ్రే అన్నారు.  

ఇదీ చదవండి.. ఆగని ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega