ISIS-Afghanistan: ఆప్ఘన్‌లో బాంబు పేలుళ్లు.. తాలిబన్లు అలర్ట్‌

29 Apr, 2022 07:03 IST|Sakshi

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో ఐఎస్‌ఐఎస్‌(ISIS) తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉత్తర అఫ్గానిస్థాన్​లో గురువారం రాత్రి మినీ బస్సుల్లో బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ రెండు బాంబు పేలుళ్లలో 9 మంది మృతిచెందగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని మజార్-ఇ-షరీఫ్‌లో రెండు మినీ బస్సులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు పేలుళ్లు జరిపారని తాలిబన్‌ అధికారులు తెలిపారు. దీంతో తాలిబన్ బలగాలు ఘటనా స్థలాన్ని చుట్టుముట్టాయి. గత వారమే మసీదు, మతపరమైన పాఠశాలలో జరిగిన బాంబు దాడిలో 33 మంది మరణించిన విషయం తెలిసిందే. షియాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు ముష్కరులు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా, తాజాగా జరిగిన దాడికి తామే కారణమంటూ ఐఎస్‌ఐఎస్‌(ISIS) తెలిపింది. 

ఇది కూడా చదవండి: చెప్పినట్లు వింటావా.. లేదంటే మరో 20 మంది మగాళ్లను తీసుకురమ్మంటావా?

మరిన్ని వార్తలు