‘యూఎన్‌’ ఏజెన్సీపై ఇజ్రాయెల్‌ ఆగ్రహం.. సంచలన ఆదేశాలు

13 Feb, 2024 12:29 IST|Sakshi

జెరూసలెం: గాజాలో శరణార్థుల కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి(యూఎన్‌) ఏజెన్సీ ‘యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ’పై ఇజ్రాయెల్‌ చర్యలు చేపట్టింది. తమ భూభాగంలోని ఏజెన్సీ కార్యాలయాలను వెంటనే మూసేయాలని ఇజ్రాయెల్‌ గృహనిర్మాణ శాఖ మంత్రి తాజగా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి ఆ సంస్థతో ఉన్న అన్ని రకాల ఒప్పందాలను రద్దు చేయనున్నట్లు, భవిష్యత్తులో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వీల్లేదని ఆదేశాల్లో తెలిపారు.

దీంతో ఇజ్రాయెల్‌లో యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ ఇప్పటికే వాడుతున్న, లీజుకు తీసుకుని కార్యకలాపాలు మొదలు పెట్టని  ప్రదేశాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హమాస్‌కు యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏకు మధ్య ఎప్పటినుంచో సంబంధాలున్నాయని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌(ఐడీఎఫ్‌) ఆరోపిస్తుండటమే ఈ చర్యలకు కారణమైనట్లు తెలుస్తోంది.

యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏకు చెందిన కొందరు ఉద్యోగులు గత ఏడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడిలో పాల్గొన్నట్లు ఆధారాలు ఇజ్రాయెల్‌ సైన్యానికి లభించాయి. ఓ మహిళ కిడ్నాప్‌లోనూ వీరి హస్తం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఏజెన్సీ వారిని విధుల నుంచి తొలగించింది. 

ఇదీ చదవండి.. పాకిస్థాన్‌లో పవర్‌ షేరింగ్‌

whatsapp channel

మరిన్ని వార్తలు