30 నిమిషాల్లో హ్యాకింగ్‌, విస్తుపోయే నిజాలు!

13 Aug, 2020 15:39 IST|Sakshi

ఏదైనా లోకల్‌  నెట్‌వర్క్‌లోకి ప్రవేశించడానికి హ్యాకర్లకు కేవలం 30 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఈ విషయం  పాజిటివ్ టెక్నాలజీస్ అనే సంస్థ జరిపిన అధ్యయనాలలో తేలింది.  లోకల్‌  నెట్‌వర్క్‌లు ఎంత తేలికగా హ్యాకింగ్‌కు గురవుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవాలనే  ఉద్దేశ్యంతో  పాజిటివ్‌ టెక్నాలజీస్‌ ఈ ప్రయోగం చేసింది. దీంట్లో ఎంత తేలికగా హ్యాక్‌ చేయొచ్చొ తెలిసేలా చేసింది. హాస్పటళ్లు, కార్పొరేట్‌ కంపెనీలు, ఫినాన్స్‌,  ఐటీ, టూరిజం ఇలా అన్నింటికి సంబంధించిన వాటి మీద టెస్ట్‌ చేసింది. దీనిలో కొన్ని విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. ప్రతి ఆరుకంపెనీలలో ఒక కంపెనీ తేలికగా హ్యాంకింగ్‌కు గురయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. 

పాజిటివ్‌ టెక్నాలజీస్‌కు సంబంధించిన వారు నిజమైన హ్యాకర్లు ఎలా అయితే దాడికి పాల్పడతారో అలాగే చేశారు. ఇలా చేయడానికి పెంటెస్ట్‌ అని పేరు పెట్టారు. హ్యాకర్లను పెంటెస్టర్లు అని పిలుస్తారు.  పాజిటివ్ టెక్నాలజీస్ పరీక్షించిన సంస్థలలో 93 శాతం స్థానిక నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయగలిగింది. ఈ ప్రయోగంలో కొన్ని సంస్థల డేటా గతంలో హ్యాకింగ్‌ బారిన పడినట్లు తెలిసింది.  స్థానిక నెట్‌వర్క్‌ని హ్యాక్‌  చేయడానికి కనీసం 30 నిమిషాల నుంచి గరిష్టంగా 10 రోజుల వరకు పట్టొచ్చని నిపుణులు తెలిపారు. చాలా సందర్భాల్లో, దాడి సంక్లిష్టత తక్కువగా ఉంటుందని, ఇది ప్రాథమిక నైపుణ్యాలు కలిగిన హ్యాకర్ లోపలికి ప్రవేశించడానికి ఎక్కువ అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. వీటిలో కనీసం ఒక డొమైన్ ఖాతా  పాస్‌వర్డ్‌ను హ్యాకర్ విజయవంతంగా ఛేదించ గలిగితే వారు ఇతర వినియోగదారుల పాస్‌వార్డులను ఆఫ్‌లైన్‌లో హ్యాక్‌ చేయవచ్చని తేలింది.  ఈ ప్రయోగంలో ఇదేవిధంగా చేసి పాజిటివ్‌ టెక్నాలజీస్‌ వారు 90,000 ఈ మెయిల్స్‌ను కనుగొంది.  

చదవండి: ఖాతాల హ్యాకింగ్‌పై వివరణ ఇవ్వండి

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా