తీవ్ర తుపాను దిశగా ‘ఇటా’

2 Nov, 2020 08:41 IST|Sakshi

మియామీ (యూఎస్‌): ఇటా తుపాను కరీబియన్‌లోని పలు ప్రాంతాలను బెంబేలెత్తిస్తోంది. ఇది సోమవారం నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.  దీని ప్రభావంతో ఆదివారం ఉదయం గంటకు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచాయి. ఈ తుపాను మంగళవారం ఉదయానికి నికరాగ్వా, హోండూరస్‌ తీరాన్ని తాకుతుందని భావిస్తున్నారు. నికరాగ్వా, హోండూరస్, జమైకా, కేమన్‌ ఐలాండ్స్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

53కు చేరిన టర్కీ భూకంప మృతులు
ఇజ్మిర్‌: టర్కీలోని ఇజ్మిర్‌ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం సంభవించిన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య ఆదివారానికి 53కు చేరుకుంది. గాయపడిన వారి సంఖ్య 900 దాటింది. కూలిన భవనాల శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో 70 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలతో బయటపడ్డాడు. శిథిలాల కింద దాదాపు 34 గంటలు గడిపిన అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు