Telca House: ఎకో ఫ్రెండ్లీ హౌస్‌.. అతని ఆలోచన నుంచి ఉద్భవించిందే!

5 Dec, 2021 20:37 IST|Sakshi
టెల్కా హౌస్‌

మన పూర్వికులు మట్టితో కట్టిన ఇళ్లలో జీవించారు. సైన్స్‌ అభివృద్ధిచెందని కాలంలో మట్టి ఇళ్లను నిర్మించుకుని నివాసమున్నారు. ఐతే టెక్నాలజీపై ప్రపంచానికే పాఠాలు చెప్పగల ఈ సంపన్న దేశంఎందుకో మట్టితో ఇళ్లను కట్టుతోంది. ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం..

ఇటలీలోని రావెన్న ప్రాంతంలో కుండ ఆకారంలో బంకమట్టితో ఇళ్లు కడుతున్నారు. అచ్చం.. మన పూర్వికుల ఇళ్లమాదిరి కట్టేస్తున్నారు. వీటిని టెల్కా హౌసులు అని అంటారు. అంతేకాదు 3డీ ప్రింటింగ్‌ సహాయంతో కేవలం మూడున్నర గంటల్లో వీటిని నిర్మిస్తున్నారు. 645 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టిన ఈ గుండ్రని ఇళ్ల లోపల బెడ్‌ రూం, బాత్‌ రూం, లివింగ్‌ రూములతో సకల సౌకర్యాలతో కూడి ఉన్నాయి.

ఈ డోమ్‌ హౌస్‌ల నిర్మాణాల వెనుక గొప్ప సందేశం కూడా ఉందండోయ్‌! వీటిని నిర్మించాలనే ఆలోచన సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్ మారియో కుసినెల్లా నుండి ఉద్భవించింది. ఇళ్లు లేనివారు వీటిని వాడుకోవచ్చట కూడా. రాబోయో రోజుల్లో ఇంకా తక్కువ సమయంలో కట్టేస్తానంటున్నాడు మారియో. ప్రపంచంలోనే మొట్టమొదటి పర్యావరణ హిత ఇళ్లివి (ఎకో ఫ్రెండ్లీ హౌస్‌). ప్రకృతి విపత్తుల్లో ఒక వేళ ఇవి కూలిపోతే 3డి ప్రింటింగ్‌తో తిరిగి నిర్మించుకోవచ్చిన మారియో చెబుతున్నాడు.  

విపత్తు సంభవించే ప్రాంతాలకు ఇటువంటి ఇళ్లు మంచి ఎంపిక అని మారియో చెప్పారు. జీరో కార్భన్‌ కన్‌స్ట్రక్షన్‌ ఆవిష్కరణ కోసం ఈ ప్రాజెక్ట్ ఎంపిక చేయబడింది. ఈ ప్రాజెక్ట్ క్లైమాట్‌ ఛేంజ్‌ సమ్మిట్‌లో కూడా ప్రదర్శించబడింది.

చదవండి: కోట్ల విలువచేసే ఇంటికి నిప్పంటించాడు..ఎందుకో తెలుసా?

మరిన్ని వార్తలు