24 ఏళ్లుగా అన్న కోసం గాలింపు.. చివరికి అతడి చేతిలోనే

6 Nov, 2021 16:59 IST|Sakshi

ఇటలీలో చోటు చేసుకున్న దారుణం

అన్న కోసం తమ్ముడు గాలిపు

తమ్ముడిపై పగ పెంచుకున్న అన్న

రోమ్‌: ఇద్దరు అన్నదమ్ములు బాల్యం నుంచి చాలా అన్యోన్యంగా ఉండేవారు. తండ్రి మరణం తర్వాత అన్న ఇంటి నుంచి పారిపోయాడు. పోలీసు కంప్లైంట్‌ ఇచ్చారు.. టీవీ, పేపర్‌లో ప్రకటనలు ఇచ్చారు. అయినా ఫలితం లేదు. దాదాపు 24 ఏళ్లుగా సోదరుడి కోసం గాలిస్తూనే ఉన్నాడు తమ్ముడు. ఈ క్రమంలో ఓ దారుణం చోటు చేసుకుంది. ఏ అన్న కోసమైతే ఇంతలా గాలిస్తున్నాడో.. అతడే ఓ రోజు ఇంటికి వచ్చి.. తమ్ముడిపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు తమ్ముడు. ఈ సంఘటన ఇటలీలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..

ఇటలీకి చెందిన మార్టిన్ రాబన్సర్ (35), ఐవో (42) ఇద్దరు సోదరులు. ఈ క్రమంలో 1997లో వీరి తండ్రి మరణించాడు. ఆ బాధ తట్టుకోలేపోయిన ఐవో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీవీలో, పేపర్‌లో ప్రకటనలు ఇచ్చారు. కానీ ఫలితం శూన్యం. కానీ మార్టిన్‌ మాత్రం పట్టువదలకుండా సోదరుడి కోసం గాలిస్తూనే ఉన్నాడు. 
(చదవండి: ఎయిర్‌ హోస్టెస్‌ల అర్థనగ్న నిరసనలు.. కారణం అదేనట..!)

మార్టిన్‌ సోదరుడి కోసం వెతుకుతుండగా.. మరో వైపు ఐవో ఇందుకు భిన్నంగా ఉన్నాడు. ఇరుగు పొరుగు వాళ్లు అన్న మాటలు తట్టుకోలేక తన తండ్రి చనిపోయాడని.. కుటుంబ సభ్యులు కూడా బయటి వారికే మద్దతిచ్చారని అనుకోసాగాడు. ఈ క్రమంలో తమ్ముడి మీద పగ పెంచుకున్నాడు. ఎలాగైనా అతడి మీద ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. 

ఈ క్రమంలో ఓ రోజు తెల్లవారుజామున సోదరుడి ఇంటికి వచ్చాడు. వెంట కత్తి కూడా తెచ్చుకున్నాడు. ఇక నిద్రిస్తున్న మార్టిన్‌ని లేపి మరి కత్తితో దారుణంగా పొడిచి పారిపోయాడు. చావుబతుకుల్లో ఉన్న మార్టిన్‌ను అతడి భార్య ఆస్ప్రతిలో చేర్పించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఐవో కోసం గాలిస్తున్నారు. 
(చదవండి: మాజీ పోర్న్‌ స్టార్‌ అరెస్ట్.. కొడుకును హత్య చేసిందని ఆరోపణలు)

ఇక ఇంటి నుంచి వెళ్లిపోయిన ఐవో పేవ్‌మెంట్‌ మీద నిద్రిస్తూ.. పార్ట్‌ టైం జాబ్‌ చేసుకుంటూ కాలం వెళ్లదీసినట్లు పోలీసులు తెలిపారు. ఖాళీ సమయమంతా లైబ్రరీలో గడిపేవాడన్నారు. ఇక మార్టిన్‌ను హత్య చేయాలని భావించిన ఐవో కొన్ని నెలల క్రితమే తమ్ముడు ఉంటున్న నగరానికి వచ్చాడని.. మార్టిన్‌ను కదలికలను గమనిస్తున్నాడని పోలీసులు తెలిపారు. 

చదవండి: నా భార్య బాధ తట్టుకోలేకపోతున్నా.. నన్ను జైల్లో పడేయండి!

మరిన్ని వార్తలు