Russia-Ukraine Conflict: పుతిన్‌- బైడెన్‌ల అత్యవసర భేటీ!

21 Feb, 2022 16:22 IST|Sakshi

Russia Says Premature Talk: ఉక్రెయిన్‌పై రష్యా ఉద్రిక్తతలను శాంతింపజేయడానికి పారిస్ సమావేశం జరిగే అవకాశం ఉందని ప్రకటించిన నేపథ్యంలో రష్యా అమెరికా అధ్యక్షుల శిఖరాగ్ర సమావేశం నిర్వహించేందుకు రంగం సిద్ధమైందని రష్యా ప్రభుత్వ యంత్రాంగం పేర్కొంది. ఈ మేరకు రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశమయ్యేందుకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదిరిందని ఫ్రెంచ్ ప్రెసిడెన్సీ సోమవారం ప్రకటించింది.

ఈ శిఖరాగ్ర సమావేశం జరగాలంటే మాస్కో సైన్యం ఉక్రెయిన్‌ పై దాడి చేయకూడదని అమెరికా పేర్కొంది. నిజానికి ఏదైన శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించడానికి ఒక నిర్ధిష్ట ప్రణాళిక ఉంటుంది. కానీ ఈ సమావేశం ఎలాంటి ప్రణాళికలు లేని అ‍త్యవసర సమావేశంగా రష్యా అభివర్ణించింది. అయితే విదేశాంగ మంత్రుల స్థాయిలో ఈ చర్చలు కొనసాగించాలని నిర్ణయించింది. అంతేకాదు అత్యవసరం అనుకుంటే రష్యా, అమెరికా అధ్యక్షులు టెలిఫోన్ కాల్ ఏదా ఇతర పద్ధతుల ద్వారా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని రష్యా ప్రతినిధి తెలిపారు.

అయితే దేశాధినేతలు సముచితంగా భావిస్తేనే ఈ సమావేశం సాధ్యమవుతుందని చెప్పారు. పైగా క్రెమ్లిన్ భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పుతిన్ అధ్యక్షత వహించబోతున్నారు. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురవారం యూఎస్‌ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో జరగనున్న షెడ్యూల్ చర్చలకు ముందు ఫ్రెంచ్ కౌంటర్ జీన్-వైవ్స్ లే డ్రియన్‌తో టెలిఫోన్‌లో మాట్లాడాలని భావిస్తున్నారు.

ఉక్రెయిన్‌ చుట్టు రష్యా దళాలు మోహరించి ఉండటమే కాక యుద్ధ భయాల్ని విపరీతంగా పెచ్చింది. అంతేగాక తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వేర్పాటువాదులకు ఉక్రెయిన్‌ సైన్యానికి మధ్య జరుగుతున్న యుద్ధమే ఈ ఉద్రిక్తలకు మరింత పెరిగిపోవడానకి కారణమైంది. ప్రజల ప్రాణాలకు అపాయం కలిగించేలా ఉక్రేనియన్ సైన్యం చేస్తున్న రెచ్చగొట్టే, దూకుడు చర్యల గురించి ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు రష్యా ప్రతినిధి తెలిపారు.

(చదవండి: చైనాతో అత్యంత క్లిష్టంగా సంబంధాలు)

మరిన్ని వార్తలు