‘లంక రేవు’ను పర్యవేక్షిస్తున్నాం: జైశంకర్‌

18 Aug, 2022 07:36 IST|Sakshi

బ్యాంకాక్‌: శ్రీలంక పోర్టు హంబన్‌టొటలో చైనా నిఘా నౌక యువాన్‌ వాంగ్‌ 5 రావడంతో భారత్‌ భద్రతకు భంగం వాటిల్లే పరిణామమేదైనా జరుగుతుందేమోనని పర్యవేక్షిస్తున్నామని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ చెప్పారు. భారత్‌ థాయ్‌లాండ్‌ జాయింట్‌ కమిషన్‌ భేటీ సందర్భంగా జైశంకర్‌ మాట్లాడారు. మా పొరుగు దేశంలో జరిగే ఎలాంటి పరిణామాలైననా గమనిస్తూ ఉంటామని చెప్పారు. చైనాకు చెందిన హైటెక్‌ నౌక యువాన్‌ వాంగ్‌ 5 శాంతి, స్నేహ సంబంధాల మిషన్‌ అని ఆ నౌక కెప్టెన్‌ జాంగ్‌ హాంగ్‌వాంగ్‌ పేర్కొన్నారు.

భారత్‌ అభ్యంతరాలు, ఆందోళనలు బేఖాతర్‌ చేస్తూ చైనా హైటెక్‌ నిఘా నౌక యువాన్‌ వాంగ్‌ 5 శ్రీలంకలోని హంబన్‌టొట రేవు పట్టణంలోకి మంగళవారం ఉదయం ప్రవేశించింది. ఈ విషయాన్ని పోర్టు అధికారులు వెల్లడించారు. ఇంధనం నింపుకోవడానికే ఈ రేపులో ఆగినట్టుగా చైనా బయటకి చెబుతున్నప్పటికీ మన దేశ  రక్షణ కార్యకలాపాలపై నిఘా వేయడం కోసమే డ్రాగన్‌ ఈ నౌకను పంపినట్టుగా అనుమానాలు వెలువడుతున్నాయి.

ఇదీ చదవండి: భారత్, శ్రీలంక.. ఒక చైనా నౌక

మరిన్ని వార్తలు