గమ్యస్థానం చేరిన జేమ్స్‌వెబ్‌ టెలిస్కోప్‌ 

26 Jan, 2022 05:10 IST|Sakshi

మెల్‌బోర్న్‌: మానవాళి ప్రతిష్టాత్మకంగా భావించే జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోపు తన గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకొంది. భూమి, సూర్యుడికి మధ్యన ఉండే ఎల్‌2 పాయింట్‌ (లాంగ్రేజియన్‌ 2 పాయింట్‌)ను చేరినట్లు నాసా వర్గాలు తెలిపాయి. ఎల్‌2 పాయింట్‌ భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈ పాయింట్‌లో ఇకపై వెబ్‌ టెలిస్కోప్‌ పరిభ్రమణ జరుపుతుంది. నెల రోజుల క్రితం ఈ టెలిస్కోప్‌ను అంతరిక్షంలోకి పంపారు. విశ్వ ఆవిర్భావ రహస్యాల శోధన లక్ష్యంగా దీని నిర్మాణం జరిగింది.

2022 జూలై నుంచి టెలిస్కోపు నుంచి రీడింగ్స్‌ భూమికి రావడం ఆరంభమవుతుంది. ఈలోపు టెలిస్కోపు తనను తాను కక్ష్యలో సర్దుబాటు చేసుకోవడం, దర్పణాలు సమలేఖణం(అలైన్‌మెంట్‌) చెందడం వంటి పను లు పూర్తి చేయాల్సిఉంది. లక్ష్యాన్ని చేరడానికి ఒక రోజు ముందే టెలిస్కోప్‌లోని 18 దర్పణాలు పూరి ్తగా తెరుచుకోవడం విజయవంతంగా జరిగింది. దాదాపు 1000 కోట్ల డాలర్ల వ్యయంతో దీన్ని నిర్మించారు.

మరిన్ని వార్తలు