ఒంటరితనానికి ఓ మంత్రిత్వ శాఖ, ఎందుకో తెలుసా?

28 Feb, 2021 11:40 IST|Sakshi

జపాన్‌లో ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు 

ఆత్మహత్యల సంఖ్య పెరగడంతో మంత్రి నియామకం 

తొలిసారిగా ఈ శాఖ  ఏర్పాటు చేసిన బ్రిటన్‌ ప్రభుత్వం

అదే దిశగా ఆలోచనలు చేస్తున్న ఆస్ట్రేలియా.. 

సాక్షి, హైదరాబాద్‌: ఒంటరితనం.. చుట్టూ ఎందరున్నా ఏకాకిగా ఉన్నామన్న భావన చాలా మంది లో ఉంటుంది. ఈ భావన ఎక్కువ కాలం కొనసాగి తే మానసిక, ఆరోగ్యపరమైన సమస్యలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ఒంటరితనం కారణంగా గుండెజబ్బులు, డిమెన్షి యా, నియంత్రణ లేకుండా ఆహారం తీసుకోవడం లేదా తక్కువ ఆహారం తీసుకోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ సమస్య మరింత పీడిస్తూ ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచనలు వస్తుంటాయి. ఇలాంటి వారిని కుటుంబసభ్యులు, మిత్రులు గుర్తించి ఆ కుంగుబాటు, ఒంటరితనం నుంచి బయటపడేలా స్థైర్యాన్ని అందించాలి. ఈ విషయంలో వ్యవస్థాగతంగా, ప్రభుత్వపరంగా తోడ్పాటును ఇప్పుడిప్పుడే పలు దేశాల్లో అందిస్తున్నాయి. 

జపాన్‌లో మినిస్ట్రీ ఆఫ్‌ లోన్లీనెస్‌ 
జపాన్‌ ప్రధాని యోషిహిదే సుగ ఇటీవల తన కేబినెట్‌లో ‘మినిస్ట్రీ ఆఫ్‌ లోన్లీనెస్‌’అనే కొత్త మంత్రిత్వ శాఖను పెట్టారు.  గత 11 ఏళ్లతో పోలిస్తే జపాన్‌లో కోవిడ్‌ కారణంగా ఒంటరితనం ఎక్కువై ఆత్మహత్యల సంఖ్య పెరగడంతో దీనిపై దృష్టి సారించారు. ప్రజల్లో ఒంటరితనం సమస్యను జపాన్‌ దేశం సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్నదే. అయితే గతేడాది అక్టోబర్‌ నెలలోనే మొత్తం 2,153 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అదేనెలలో కరోనాతో 1,765 మంది మాత్రమే మరణించారు. అంటే కోవిడ్‌ కంటే ఆత్మహత్యల సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు జపాన్‌ నేషనల్‌ పోలీస్‌ ఏజెన్సీ వెల్లడించింది.  అంతకు ముందు ఏడాదితో పోలిస్తే వీరి సంఖ్య 70 శాతం అధికమని చెబుతున్నారు. 

బ్రిటన్‌దే తొలి అడుగు.. 
‘లోన్లీ మినిస్టర్‌’ను నియమించిన తొలిదేశం బ్రిటన్‌. 2018లోనే ఇందుకు ఓ శాఖను ఏర్పాటు చేసి మంత్రిని నియమించింది. బ్రిటన్‌లోని 90 లక్షల మంది ప్రజలు ఒక్కోసారి లేదా ఎల్లప్పుడూ ఒంటరిగా ఉన్నామన్న భావనలో ఉంటున్నట్లు 2017లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడి కావడంతో వెంటనే ఆ దిశలో ఆ సమస్యను అధిగమించేందుకు మంత్రిని నియమించింది. అయితే ఈ శాఖను నిర్వహించేందుకు మంత్రులు అంతగా సుముఖత వ్య క్తం చేయకపోవడంతో మూడేళ్లలో ముగ్గురు మం త్రులను మార్చాల్సి వచి్చంది. ఆ్రస్టేలియా కూడా ఒంటరితనానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. 

హ్యాపీనెస్‌ శాఖ పెట్టాలి.. 
‘జపాన్‌ ఇతర దేశాలతో పోలిస్తే భార త్‌ సమాజం పూర్తిగా భిన్నమైంది. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి, చిన్న కుటుంబాలు వచ్చాయి. అవివాహితులు కూడా ఉంటున్నారు. జపాన్‌లో పనికి అధిక ప్రాధాన్యమిస్తారు. దీంతో ఒత్తిడికి గురై, పని తర్వాత ఏంటన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అయి తే భారత్‌లో కుటుంబం లేదా సమాజం మద్దతు ఉంటుంది. హైదరాబాద్‌లో కంటే ముంబై, తదితర చోట్ల పని ఒత్తిడి తదితర కారణాలతో ఒంటరితనం, కుంగుబాటు సమస్యలు వస్తున్నాయి. మనదేశం విషయానికొస్తే ఒంటరితనానికి శాఖ కన్నా భూటా న్‌లో మాదిరిగా హ్యాపీనెస్‌కు సంబంధించి మంత్రిత్వ శాఖ పెడితే బాగుంటుంది.  హ్యాపీనెస్‌ ఇండెక్స్‌ ద్వారా ఆయా సమస్యలను అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటే మంచిది. – డా.నిశాంత్‌ వేమన, కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్, సన్‌షైన్‌ హాస్పిటల్

మరిన్ని వార్తలు