కరోనా కట్టడిలో జపాన్‌ నగరాలు ఫస్ట్‌

25 Aug, 2020 18:03 IST|Sakshi

టోక్యో : కోవిడ్‌–19 మహమ్మారిని అరికట్టడంలో జపాన్‌ నగరాలు ప్రపంచంలోనే ముందున్నాయి. జపాన్‌ నగరాల్లో జనాభా ప్రపంచంలోని ఇతర నగరాలకన్నా ఎక్కువే ఉన్నప్పటికీ ఆ నగరాల్లో కోవిడ్‌–19 అదుపులో ఉండడం విశేషం. అందుకు పట్టణాభివృద్ధిలో పక్కా ప్రణాళికలను ఉపయోగించడం, భవనాల నిర్మాణాల్లో శాస్త్రవిజ్ఞానాన్ని ఉపయోగించడం, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణలో క్రమశిక్షణను పాటించడం తదితర కారణాలు.

ఆగస్టు 20వ  తేదీ నాటికి జపాన్‌ మొత్తంలో కరోనా కేసులు దాదాపు 60 వేలు మాత్రమే. మూడు కోట్ల ఎనభై లక్షల జనాభా కలిగిన జపాన్‌ రాజధాని నగరం టోక్యోలో ఆగస్టు 24వ తేదీ వరకు 19వేల చిల్లర మాత్రమే. ఆ నగరంలో 84 చదరపు గజాలకు ఒకరు చొప్పున ప్రజలు నివసిస్తున్నారు. 27 వేల చదరపు గజాలకు ఒకరు చొప్పున నివసిస్తోన్న అమెరికాలోని న్యూయార్క్‌ పట్టణంలో కరోనా కేసులు 4,56,000లకు చేరుకున్నాయి. (శ్మశానానికి తీసుకెళ్లగానే శ్వాస పీల్చింది!)

టోక్యో నగరంతోపాటు జపాన్‌ క్యోటో, ఒసాకా లాంటి నగరాల్లో మెట్రో రైళ్లు అద్భుతంగా నడుస్తున్నాయి. బయటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మెట్రో రైళ్లలోని సీట్ల ఉష్ణోగ్రతలు సమతౌల్యంగా ఉంటాయి. అన్ని ప్రాంతాలకు మెట్రో సౌకర్యం ఉండడంతో సంపన్నులు కూడా సొంత కార్లను వాడకుంటా మెట్రోల్లోనే ప్రయాణిస్తారు.

అక్కడి నగర ప్రజలు ఫుట్‌పాత్‌లపైనే నడుస్తారు. ఫుట్‌పాత్‌లపై ఎలాంటి వ్యాపారాలను అనుమతించరు. భారత్‌లాంటి దేశాల్లో ఫుట్‌పాత్‌లపై హాకర్ల వ్యాపారాలు నడుస్తుంటే ప్రజలు రోడ్లపై నడుస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో అసలు ఫుట్‌పాత్‌లే ఉండవు. జపాన్‌ నగరాల్లో షాపింగ్‌ మాల్స్, బార్బర్‌ షాపులు, రెస్టారెంట్లను మూసివేయకున్నా కరోనా తీవ్రంగా ప్రభలడం లేదంటే వారి క్రమశిక్షణను అర్థం చేసుకోవచ్చు. జపాన్‌ నగరాల్లో షాపులు, రెస్టారెంట్లు తెల్లవారుజామున మూడు గంటల వరకు తెరిచే ఉంటాయి. నగర ప్రజలు మాస్క్‌లు ధరించడంతోపాటు వీలైనంత వరకు భౌతిక దూరాన్ని పాటిస్తున్నారు. ఎవరు కూడా మరొకరితో అనవసరంగా మాట్లాడారు. ఎవరి పనుల్లో, ఎవరి ఆలోచనల్లో వారు బిజీగా ఉంటారు.

కరోనా రాక ముందు నుంచే కొన్నేళ్లుగా మాస్క్‌లు ధరించే అలవాటు జపాన్‌ నగర వాసులకుంది. ఫ్లూ విజృంభనతో వారికి మాస్క్‌లు ఆనవాయితీగా వస్తున్నాయి.

చదవండి: భయపెడుతున్న హాంకాంగ్‌ కరోనా కేసు

మరిన్ని వార్తలు