4,800 కోట్ల డాలర్లతో జపాన్‌ అత్యవసర ప్యాకేజీ

27 Apr, 2022 19:43 IST|Sakshi

టోక్యో: ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో దేశంలో పెరుగుతున్న చమురు, తిండి గింజల ధరల ప్రభావాన్ని తగ్గించేందుకు 4,800 కోట్ల డాలర్ల అత్యవసర ప్యాకేజీని జపాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ప్యాకేజీతో చమురు సబ్సిడీలు, చిన్న వ్యాపారాలకు, అల్పాదాయ కుటుంబాలకు ఊతం అందిస్తామని ప్రధాని తెలిపారు. 

కాగా ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించి రెండు నెలలు గడిచిపోయాయి. ఆరు రోజుల్లో ముగుస్తుందని పుతిన్‌ అనుకున్న యుద్ధం కాస్తా 60 రోజులైనా కొనసాగుతూనే ఉంది. రష్యా దాడులతో ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నా తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఉక్రెయిన్ సైన్యం రష్యా బలగాలకు గట్టిగా సమాధానం చెబుతోంది. అంతేగాక ఉక్రెయిన్ కూడా రష్యాపై ప్రతి దాడులు చేస్తోంది.

చదవండి: (పక్షులన్నీ కలిసి రాకాసి పక్షిలా.. ఎందుకిలా..?)

మరిన్ని వార్తలు