Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై దుండగుడి కాల్పులు

8 Jul, 2022 08:34 IST|Sakshi

టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు కలకలం రేపాయి. జపాన్‌ పశ్చిమ ప్రాంతమైన నర పట్టణంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ కార్యక్రమంలో భాగంగా అబే ప్రసంగిస్తుండగా ఆయనపై కాల్పులు జరిగాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఆయన తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. దుండగుడు తుపాకీతో అబేపై రెండురౌండ్లు కాల్పులు జరిపారని, ఆయనకు తీవ్ర రక్తస్రావం అయిందని జపాన్‌కు చెందిన మీడియా సంస్థ ఎన్‌హెచ్‌కే తన కథనంలో తెలిపింది.

హుటాహుటిన అబేను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారని, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. మరోవైపు అబేకు గుండెపోటు వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారని సదరు వార్తా సంస్థ పేర్కొంది. కాగా,2006 నుంచి 2012 వరకు జపాన్ ప్రధానిగా షింజో అబే సేవలందించారు. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించిన నేపథ్యంలో ఆయనకు కేంద్రం పద్మ విభూషణ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

చదవండి👇 
మంత్రుల తిరుగుబాటు.. రాజీనామాకు ప్రధాని బోరిస్‌ ఓకే
Russia-Ukraine war: ఎండ్‌ కార్డ్‌ ఎప్పుడు?

మరిన్ని వార్తలు