పాపం: ఇరుకింట్లో 164 కుక్కలు

6 Nov, 2020 09:46 IST|Sakshi
ఇరుకింట్లో కుక్కలు

టోక్కో : అనారోగ్యంతో అల్లాడుతున్న ఆ మూగ జీవాలు ఇరుకు గదుల్లో పడి మగ్గిపోయాయి. బయటికి వెళ్లలేక,  ఉన్నచోట స్వేచ్ఛగా తిరగలేక నరకం అనుభవించాయి. చివరకు ప్రజా ఆరోగ్య శాఖ అధికారుల పుణ్యమా అని అక్కడి నుంచి బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని ఇజుమోలో ముగ్గురు సభ్యుల ఓ కుటుంబం అనారోగ్యంతో ఉన్న కుక్కలను చేరదీసి సాకుతోంది. అలా 164 కుక్కలను ఇంటికి తీసుకువచ్చి, వాటి బాగోగులను చూసుకుంటోంది. అయితే వారు ఉంటున్న ఇళ్లు చిన్నది కావటంతో అన్ని కుక్కలు అక్కడ జీవించటం కష్టంగా మారింది. చెక్క అరల్లో, టేబుళ్లు, కుర్చీల మీద, వాటి కింద  ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇరుక్కుని పడుకునేవి. ( ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకరినే మ‌నువాడారు! )

వాటి పరిస్థితి గమనించిన పొరుగింటి వారు ప్రజా ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన వారు కుక్కల్ని సాకుతున్న కుటుంబంతో మాట్లాడి వాటికి చికిత్స అందించి సురక్షిత ప్రాంతానికి తరలించారు.  కాగా, సదరు ఇంట్లోంచి దుర్వాసన, పెద్ద పెద్ద శబ్ధాలు వస్తున్నాయని ఏడు సంవత్సరాల క్రితం కూడా పొరుగిళ్ల వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పుడు చర్యలు తీసుకోకుండా ఆ కుటుంబం అధికారులను అడ్డుకుంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా