‘జోకర్‌’ బీభత్సం: రైల్లో మంటలు.. 10 మందికి గాయాలు

1 Nov, 2021 16:13 IST|Sakshi

జపాన్‌లో చోటు చేసుకున్న సంఘటన

హాలోవీన్  సందర్భంగా జనాలును భయపెట్టిన వ్యక్తి

టోక్యో: జపాన్‌ రాజధాని టోక్యోలో ఆదివారం హాలోవీన్‌ కార్యక్రమం జరిగింది. చిత్ర విచిత్రమైన గెటప్పుల్లో వచ్చి జనాలను భయభ్రాంతులకు గురి చేయడమే దీని ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ప్రతి ఏటా అక్టోబర్‌ 31న హాలోవీన్‌ సంబరాలు నిర్వహిస్తాయి. ఈ క్రమంలో జపాన్‌లో హాలోవీన్‌ సందర్భంగా బ్యాట్‌మ్యాన్‌ సినిమాలో విలన్‌ ‘జోకర్‌’ వేషధారణలో వచ్చిన ఓ వ్యక్తి రైల్లో బీభత్సం సృష్టించాడు. ట్రైన్‌లో మంట పెట్టాడు.. కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. ఆ వివరాలు.. 

29 ఏళ్ల యువకుడు ఒకరు హాలోవీన్‌ సందర్భంగా బ్యాట్‌మ్యాన్‌ సినిమాలో విలన్‌ ‘జోకర్‌’లా తయరయ్యాడు. అనంతరం రద్దీగా ఉండే షింజుకు రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. రైలు ఎక్కిన తర్వాత చేతిలో కత్తి, యాసిడ్‌ బాటిల్‌తో లోపల ఉన్న ప్రయాణికులను భయపెట్టాడు. అంతటితో ఆగక 60 ఏళ్ల వృద్ధుడిపై కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆ పెద్దాయన పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. అంతేకాక సదరు వ్యక్తి ట్రైన్‌ చుట్టూ ఒకలాంటి ద్రవం పోసి.. మంటపెట్టాడు. 


(చదవండి: కొత్త లుక్‌తో భయపెడుతున్న మెగాస్టార్‌.. షాక్‌లో అభిమానులు!)

అతడి చర్యలకు కంపార్ట్‌మెంట్‌లో ఉన్న ప్రయాణికులు బిక్కచచ్చిపోయారు. కొందరు కిటికీలోంచి బయటకు దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ మార్గంలో ఓ ఎమర్జెన్సీ స్టాప్‌ ఉండటంతో రైలు అక్కడ ఆపి.. అందరూ బయటకు పరుగు తీశారు. సదురు జోకర్‌ వేషదారి చేసిన పనుల వల్ల సుమారు 10మంది గాయపడినట్లు సమాచారం. 


(చదవండి: ఈ ద్రాక్ష పండ్ల గుత్తి రూ.లక్షల్లో.. ఒక్క పండు రూ.33 వేలంట..)

అప్పటికే విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఎమర్జెన్సీ స్టాప్‌ వద్దకు చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించడమే కాక ప్రయాణికులకు సాయం చేశారు. ప్రత్యక్ష సాక్షి ఒకరు మాట్లాడుతూ.. ‘‘జోకర్‌ గెటప్‌లో వచ్చిన సదరు వ్యక్తి హాలోవీన్‌ స్టంట్‌లో భాగంగా ఇలా చేసి ఉంటాడని భావిస్తున్నాం. ఎందుకంటే ట్రైన్‌ ఆగిన తర్వాత అతడు అక్కడ నుంచి నింపాదిగా నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయాడు’’ అని తెలిపాడు. 

చదవండి: Halloween 2021: దెయ్యాల్లా మారిన మన స్టార్స్‌ని గుర్తుపట్టారా?

మరిన్ని వార్తలు