ఏడేళ్ల క్రితం చనిపోయిన తండ్రి.. తిరిగి ప్రత్యక్షం

9 Jan, 2021 19:04 IST|Sakshi

టోక్యో: జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి టైంపాస్ కోసం గూగుల్ ఎర్త్ చూస్తుంటే.. ఊహించని సర్‌ప్రైజ్ కళ్ల ముందు ప్రత్యక్షమైంది. ఎప్పుడో ఏడేళ్ల కిందట చనిపోయిన తండ్రి.. అందులో కనిపించారు. అది చూడగానే ఆ వ్యక్తి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్లతో పంచుకున్నాడు. అంతే.. ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆ వివరాలు.. జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల టైంపాస్ కోసం గూగుల్ ఎర్త్‌లో తన తల్లిదండ్రుల ఇల్లు ఎలా కనిపిస్తుందో చూడాలని అనుకున్నాడు. దానిలో భాగంగా గూగుల్‌ ఎర్త్‌ ఒపెన్‌ చేసి లోకేషన్‌ టైప్‌ చేయగా అతడికి ఆ ఇంటి ముందు ఏడేళ్ల కిందట చనిపోయిన తండ్రి ఫోటో కనిపించింది. దీనిలో వీధిలో రోడ్డు పక్కన నిలుచున్న తండ్రి ఫొటో కనిపించింది. (చదవండి: భార్య గుట్టు ర‌ట్టు చేసిన గూగుల్ మ్యాప్‌)

ఏడేళ్ల క్రితం చనిపోయిన తండ్రి తిరిగి ఇలా కళ్ల ముందు ప్రత్యక్షం అయ్యే సరికి ఈ వ్యక్తి సంతోషం పట్టలేకపోయాడు. వెంటనే దీని గురించి తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.‘‘గూగుల్ ఎర్త్‌‌లో ఏడేళ్ల కిందట చనిపోయినా నా తండ్రిని చూశాను. అందులో అమ్మ.. నాన్న వద్దకు నడుస్తున్నట్లుగా ఉంది. బహుశా.. ఆయన అమ్మ కోసం రోడ్డు పక్కన ఎదురుచూస్తున్నారనుకుంటాను. ‘గూగుల్ ఎర్త్’ ఈ ప్రాంతాన్ని ఇంకా అప్‌డేట్ చేయకపోవడం వల్ల  ఏడేళ్ల క్రితం చనిపోయిన నా తండ్రిని మళ్లీ చూడగలిగాను’’ అంటూ ట్వీట్‌ చేశాడు. ప్రసుత్తం ఇది తెగ వైరలవుతోంది. ఇప్పటివరకు 6.9 లక్షల మంది లైక్ చేశారు. (చదవండి: రహస్య గది.., 9 హత్యలు)

గూగుల్ ఎర్త్‌తో వల్ల 40 ఏళ్ల క్రితం మిస్సయిన వ్యక్తి ఆచూకీ లభించడం.. మరో ఘటనలో ఓ వ్యక్తి తన ఇంటి సమీపంలోని పార్క్‌లో ప్రియుడితో రొమాన్స్‌ చేస్తోన్న భార్యని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం.. ఆపై ఆమెకు విడాకులు ఇవ్వడం గురించి గతంలో చదివే ఉన్నాం. 

మరిన్ని వార్తలు