ప్రధాని మోదీ పర్యటన.. కొద్ది రోజుల్లోనే కీలక నిర్ణయం తీసుకున్న జపాన్‌ ప్రభుత్వం

28 May, 2022 17:11 IST|Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌ పర్యటన భారత రక్షణ వ్యవస్థని మరింత బలోపేతం చేసేందుకు కీలకంగా మారనుంది. ఈ పర్యటన జరిగిన వారంలోపే.. భారత్‌కు క్షిపణులు, జెట్‌లతో సహా శక్తివంతమైన సైనిక పరికరాలను ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది జపాన్ ప్రభుత్వం. నివేదిక ప్రకారం.. భారతదేశం, ఆస్ట్రేలియాతో పాటు కొన్ని యూరోపియన్, ఆగ్నేయాసియా దేశాలకు ఆయుధాలను ఎగుమతులు చేయడానికి జపాన్‌ ప్రభుత్వ ఆ దేశ ఆయుధాలపై ఎగుమతులపై ఉన్న నిబంధనలను సడలించనుంది.

కాగా మంగళవారం టోక్యోలో జరిగిన సమావేశంలో రక్షణ తయారీతో సహా ద్వైపాక్షిక భద్రత, రక్షణ సహకారాన్ని మెరుగుపరచడానికి క్యాడ్‌ సమ్మిట్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. జపాన్‌ ప్రధాని ప్యూమియో కిషిదాను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం జరిగిన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం జరగడం విశేషం. గతంలో దాదాపు 47 సంవత్సరాల తర్వాత 2014లో జపాన్‌ ప్రధాని షింజో అబే పరిపాలన రక్షణ ఎగుమతులను నిషేదించే నిబంధలను సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ, ఇది ఇప్పటికీ ప్రాణాంతక ఆయుధాల ఎగుమతులను నిషేధిస్తుంది. తాజాగా జపాన్‌ ప్రభుత్వం ఈ చట్టానికి మరిన్ని సడలింపులు తీసుకురానుంది. దీని ద్వారా భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. జపాన్ స్వీయ-రక్షణ దళాలు, భారత సైన్యం మధ్య అక్విజిషన్ క్రాస్-సర్వీసింగ్ అగ్రిమెంట్ సెప్టెంబర్ 2020లో పలు ఒప్పందాలు జరిగాయి.

చదవండి: Elon Musk: అప్పుడు డేటింగ్‌తో చిచ్చు రాజేశావ్‌! ఇప్పుడేమో ఇలా..

మరిన్ని వార్తలు