Killing Stone!: ఆ రాయి అందర్నీ చంపేస్తుంది

9 Mar, 2022 12:06 IST|Sakshi

ఈ ప్రపంచంలో ఎన్నో విచిత్రమైన నమ్మకాలు ఉంటాయి. కొన్ని సైన్సు పరంగా చూస్తే ఒక రకంగా మంచిగానే ఉంటాయి. మరికొన్ని నమ్మకాలు మాత్రం మనల్ని భయబ్రాంతులకు గురిచేస్తాయి. ఏం జరుగుతుందో ఏమో అని ఉన్న ధైర్యాన్ని కాస్త నీరు కార్చేస్తుంది. అచ్చం అలాంటి ఘటన ప్రస్తుతం జపాన్‌లో చోటు చేసుకుంది. వారికి ఎంతో సెంట్‌మెంట్‌ గల రాయి ఇప్పుడూ వారిని భయాందోళనలకు గురి చేస్తోంది.

వివరాల్లోకెళ్తే...జపనీస్ పురాణాలలో, సెస్షో-సెకి అనేది ఒక శిలా రాయి. ఈ రాయిలో తొమ్మిది తోకల గల నక్క ఆత్మ ఉందని నమ్ముతారు జపాన్‌ వాసులు. అయితే ఆ నక్క టామామో-నో-మే అనే అందమైన స్త్రీ రూపాన్ని ధరించి, టోబా చక్రవర్తిని చంపడానికి పథకం వేసిందని చెబుతుంటారు. కానీ తమమో-నో-మే ఓడిపోయిన తర్వాత ఆమె ఆత్మ రాయి(సెస్షో-సెకిలో)లో చిక్కుకుందని నమ్ముతారు.

నాసులోని అగ్నిపర్వత పర్వతాల సమీపంలో ఉన్న ఈ రాయి 1957లో చారిత్రక ప్రదేశంగా నమోదు చేశారు. ప్రసిద్ధ సందర్శనా ప్రదేశానికి వచ్చిన సందర్శకులు రాక్ సగానికి చీలిపోయి ఉండటాన్ని చూసి భయపడ్డారు. అయితే ఈ రాయి చుట్టు ఒక తాడుతో చుట్టబడి అత్యంత జాగ్రత్తగా భద్రపరిచి ఉండేది. కానీ సందర్శకులు వచ్చి చూసేటప్పటికి తాడు విప్పబడి రాయి రెండుగా చీలుకుపోయి ఉంది.

దీని అర్థం ఆ నక్క దుష్టాత్మ పారిపోవడానికి సూచన. దీంతో ఇప్పుడూ ఆ రాయి ఎవర్ని చంపుతుందో ఏంటో అని జపాన్‌ వాసుల్లే ఒకటే టెన్షన్‌ మొదలైంది. అయితే స్థానిక అధికారులు ఈ రాయికి పగుళ్లు ఉన్నాయని, అదీగాక చల్లని వాతావరణం కారణంగా విడిపోయి ఉండవచ్చని చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు చూడకూడని దాన్ని చూశాం అంటూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

(చదవండి: ఆ ఊరిలో మగవాళ్లకు ఇల్లే లేదు! ప్రతి ఇల్లు మహిళలదే)

మరిన్ని వార్తలు