వైరల్‌గా మారిన ప్రపంచ కుబేరుల పాత ఫొటో

22 Mar, 2021 19:12 IST|Sakshi
సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటో

న్యూయార్క్‌: ప్రపంచ ప్రఖ్యాత ధనవంతులు టెస్లా సీఈఓ ఎలన్‌ మస్క్‌, అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌లు మీడియాలో కనపడటం అత్యంత అరుదు. ఏదైనా అత్యవసరమైన పని అయితే తప్ప మీడియా ముందుకు రారు. అలాంటి వీరిద్దరికి సంబంధించిన ఓ పాత ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. థంగ్‌ ఫాన్‌ అనే ట్విటర్‌ ఖాతాదారుడు పోస్ట్‌ చేసిన ఈ ఫొటో 2004 సంవత్సరానికి చెందినది. ‘‘ ఈ ఫొటో 17 ఏళ్ల క్రితందంటే నమ్మటం కష్టం. 2004లో అంతరిక్షం గురించి మాట్లాడుకోవటానికి ఏర్పాటు చేసిన డిన్నర్‌లో ఇద్దరూ పాల్గొన్నారు.

వీళ్లిద్దరూ వ్యక్తిగతంగా కలుసుకున్న అత్యంత అరుదైన సందర్భాలలో ఇదొకటి. వారు మాట్లాడుకుంటుండగా, పిలిచి ఈ ఫొటోను తీశారు’’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా,  టెస్లాకార్లను గూఢచర్యం కోసం  ఉపయోగిస్తున్నారని చైనా మిలటరీ అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎలన్‌ మస్క్‌ సంచలన ప్రకటన చేశారు. టెస్లా కార్లతో  గూఢచర్యానికి పాల్పడినట్లు రుజువైతే కంపెనీని మూసివేస్తానని ప్రకటించారు. 

చదవండి : వైరల్‌: జాగ్రత్తపడకపోతే మనకు ఇదే గతి

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు