చెఫ్, వ్యాఖ్యాతకు చెరో రూ. 745 కోట్ల నగదు పురస్కారం

22 Jul, 2021 04:54 IST|Sakshi

వాషింగ్టన్‌: రోదసీలోకి విజయవంతంగా తిరిగొచ్చా కా అమెరికా పారిశ్రామికవేత్త, అమెజాన్‌ వ్యవస్థాప కుడు జెఫ్‌ బెజోస్‌ ఒక కొత్త అవార్డును ప్రకటిం చారు. ప్రఖ్యాత చెఫ్‌ జోస్‌ ఆండ్రీస్, అమెరికాలో రాజకీయ వార్తల వ్యాఖ్యాత వాన్‌ జోన్స్‌లకు ఈ అవార్డు దక్కింది. కరేజ్‌ అండ్‌ సివిలిటీ పేరిట ఇచ్చే ఈ అవార్డుతోపాటు వీరిద్దరూ దాదాపు చెరో రూ. 745 కోట్ల(10కోట్ల డాలర్లు) నగదు పురస్కారం అందుకోనున్నారు.

మానవాళి ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పోరాడటంతో అవిశ్రాంత కృషిచేస్తున్నందుకు అవార్డును ప్రకటించినట్లు బెజోస్‌ చెప్పారు. నగదు పురస్కారంగా పొందే ఈ మొత్తాన్ని గ్రహీతలు తమ సొంత అవసరాలకు వాడుకోవచ్చు లేదా స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వవచ్చు. ఆండ్రీస్‌ ప్రఖ్యాత పాకశాస్త్ర ప్రవీణుడు.  2010లో లాభాపేక్షలేని ‘ వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌’ అనే సంస్థను స్థాపించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన చోట్ల భోజన వసతులు కల్పిస్తున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు