సిద్ధంగా ఉండండి: ఆర్మీకి జిన్‌పింగ్‌ పిలుపు

6 Jan, 2021 10:56 IST|Sakshi

బీజింగ్‌ : యుద్ధనైపుణ్య శిక్షణను బలోపేతం చేయడంతో పాటు ఎల్లప్పుడూ దేనికైనా సిద్ధంగా ఉండాలని చైనా మిలటరీకి ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. ఈ ఏడాది నుంచి కొత్తగా తీసుకువచ్చిన డిఫెన్స్‌ చట్టం అమల్లోకి రావడంతో మిలటరీ అధికారాలు మరింతగా పెరగనున్నాయి. చైనా కమ్యూనిస్టు పార్టీకి, సెంట్రల్‌ మిలటరీ కమీషన్‌కు అధిపతైన జిన్‌పింగ్‌ 2021లో పీఎల్‌ఏ, పీఎల్‌ఏఎఫ్‌కు సంబంధించిన నూతన చట్టంపై సంతకం చేశారు. ఈ చట్టం ప్రకారం ఆర్మీ ఇకపై సోషలిజంపై జింగ్‌పింగ్‌ ఆలోచనకు తగ్గట్లుగా నడుచుకోవడం, జింగ్‌పింగ్‌ ఆలోచనల ప్రకారం బలోపేతం కావడం చేయాల్సి ఉంటుంది. (అమెరికా బలగాలపై దాడికి చైనా సాయం?)

2018లో ఇలాంటి ఆదేశాలనే జిన్‌పింగ్‌ ఒకమారు జారీ చేశారు. తాజా ఆదేశాల ప్రకారం పీఎల్‌ఏ ఏ క్షణమైనా ఎలాంటి చర్యకైనా తయారుగా ఉండాలని సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్టు పత్రిక తెలిపింది. ఆర్మీకి అవసరమైన కొత్త ఆయుధాలు సమకూర్చుకోవడం, మరింత మందిని నియమించి శిక్షణ ఇవ్వడం, డ్రిల్స్‌ మోతాదు పెంచడం, సదా సిద్ధంగా ఉండడమనేవి చేయాల్సిఉంటుందని తెలిపింది.

మరిన్ని వార్తలు